ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద తరహాలో దాసరి నారాయణరావు లాగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీలో ప్రతి చిన్న వేడుకకు హాజరు అవుతూ ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తూ ఇటీవల వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఆదర్శంగా ఎప్పటినుండో వ్యవహరిస్తున్న చిరంజీవి ఇటీవల మరింతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. గతంలో ఓన్లీ మెగా హీరోల ఫంక్షన్లకు మాత్రమే వెళ్లేవారు. అయితే తాజాగా మాత్రం మొత్తం మార్చేశారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి చిన్న వేడుకకు హాజరవుతూ పెద్ద తరహా పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఇండస్ట్రీలో హీరోల ధోరణి మారాలని సూచించారు.

 

ఉదయం 7 గంటలకే సినిమా స్టార్ట్ చేసి లంచ్ బ్రేక్ విషయంలో కొద్దిపాటి విశ్రాంతి తీసుకుని మళ్లీ తిరిగి సెట్లో ఉంటే చాలా బాగుంటుందని నిర్మాతకి కూడా కొద్దిగా భారం తగ్గుతుందని చెప్పటం జరిగింది. అంతే కాకుండా ఇటీవల ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కుర్ర హీరోలు బ‌ద్ద‌కిస్తున్నార‌ని, మ‌ధ్యాహ్నం మూడింటి వ‌ర‌కూ కార్ వానుల్లోనే గ‌డిపేస్తున్నార‌ని, వంద‌ల రోజులు సినిమా సెట్లోనే ఉండిపోవ‌డం భావ్యం కాద‌ని, అది ఆరోగ్య‌క‌రం అనిపించుకోద‌ని, నిర్మాత‌ల‌కు చాలా ఇబ్బంద‌ని… చాలా సీరియ‌స్ విష‌యాలే మాట్లాడాడు చిరు.

 

ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడిన చిరంజీవి ప్రొడక్షన్ ఖర్చు తగ్గించాలంటే హీరోలు షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలలోనే ఉండాలని భారీ భారీ డైలాగులు చిరంజీవి వేశారు. దీంతో చిరంజీవి ఇచ్చిన సూచనలకు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు చిరంజీవి మీద గుస్సాగా రియాక్ట్ అయ్యారట. అంతేకాకుండా చిరంజీవి చేసిన సూచనలకు వాళ్లు ఈ విధంగా కౌంటర్లు వేశారట...ఆయన కొడుకు రామ్ చరణ్ నటిస్తున్న rrr ముందు ఫాస్ట్ గా తీయమని చెప్పండి అని కౌంటర్లు వేస్తున్నారు .. వినయ విధేయ రామ, రంగస్థలం కూడా late అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: