గోవా బ్యూటీ లాక్ ఇలియానా.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు దేవదాసు సినిమాతో పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. ఈ హాట్ బ్యూటి నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఎందుకంటే..  సన్నజాజి లాంటి  నడుం ఒంపు అందాలతో  టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది.  అసలు హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలేమో అనేంతలా  టాలీవుడ్ ని ప్రభావితం చేసింది ఇలియానా. పోకిరి హిట్ అవ్వ‌డంతో తెలుగులో తన సినిమాలతో ఓ ఊపు ఊపేసింది. మ‌రియు కోటి పారితోషకం అందుకున్న తారగా గుర్తింపు పొందింది. అదే స‌మ‌యంలో ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. 

 

ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గినా.. ఇటీవ‌ల మళ్లీ అమర్ అక్బర్ ఆంటోనీతో రీ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. పాపం ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కాస్త వెలుగు తగ్గింది. ప్ర‌స్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్‌ని తన నాజూకు నడుమందాలతో షేక్ చేస్తోంది  ఇల్లీ డియ‌ర్.. వెండితెరపై కనిపించడంలో ఎంత ఓపెన్‌గా ఉంటుందో.. ఆన్‌లైన్ వేదికలపై కూడా అంతే ఓపెన్ అవుతోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో ఈ బ్యూటీ ఫస్ట్ మూవీ బర్ఫీ. ఈ చిత్రంలో రణభీర్‌కపూర్ హీరోగా న‌టించాడు. 

 

అయితే ఇటీవ‌ల వెండితెరపై తన తొలిముద్దు అనుభవం గురించి ఇలియానా మాట్లాడుతూ.. కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట పెట్టింది. సినిమాల్లో తన మొదటి ముద్దు సన్నివేశాల గురించి చెప్తూ.. బర్ఫీ సినిమాలో రణబీర్ కపూర్‌ని ముద్దు పెట్టుకోవడం ఓ పీడకల అంటూ సమాధానం ఇచ్చింది. ఆ సీన్‌లో తాను చాలా అసౌకర్యంగా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఆ రోజు ర‌ణ‌బీర్ క‌పూర్‌తో లిప్ లాక్ సీన్‌లో న‌ర‌కం చూసాన‌ని చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటి. కాగా, అనురాగ్ బసు దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ఇలియానా రణ్ బీర్  కపూర్తో లిఫ్ లాక్ సీన్  తీశారు. అయితే ఆ సీన్  సినిమాకే మ‌రింత మ‌సాల‌ను అందిస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: