కొంతమంది ఆస్తి కోసం ఎంత మూర్కంగా ప్రవర్తిస్తారు అంటే ప్రత్యేకంగా వారిగురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో ఆస్తి కోసం ఏమైనా చేస్తారు.. చంపేయడానికి కూడా సిద్ధపడుతారు. చంపడం కోసం ఎన్నో రకాల ప్లాన్స్ వేసి ఆస్తి ఉన్న మనిషిని మాటలలో పెట్టి చంపేయాలని చూస్తారు. అలా అంత కష్టపడే బదులు అదే కష్టంతో సొంతంగా సంపాదించుకుంటే వారే కోటీశ్వరులు అవుతారు అనేది వాళ్ళకు ఎప్పుడు తెలుస్తుందో.. 

 

ఇంకా ఇది పక్కన పెడితే.. ఆ నటి ఆస్తి కోసం ఎంతమందిని చంపిందో తెలిస్తే షాక్ అయిపోతారు.. అవును ఆస్తి కోసం ఓ మంచి చూడముచ్చటైన జంటను చంపేసింది అంటే నమ్మండి.. వాళ్ళని చంపి వాళ్ళు దత్తత తీసుకున్న కొడుకును ఎంతోమంచిదానిలా పెంచుతుంది ఆమె.. ఇప్పుడు వాళ్ళని కూడా ఆ ఆస్తి కోసం వాడుకుంటుంది. అయితే పైన చెప్పింది అంత నిజమే.. 

 

కానీ రియాల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. అదేనండి ఈ నటి అగ్ని సాక్షి సీరియల్ లో విలన్ పాత్ర పోషిస్తుంది.. ఈమె ఆ సీరియల్ లో చేసినన్ని అరాచకాలు మారే సీరియల్ లో విలన్ చెయ్యలేదు అంటే నమ్మండి. ఆస్తి కోసం ఆమె ఎంతమందిని చంపిందో.. హీరోయిన్ ని ఎన్ని సార్లు కిడ్నప్ చేయించిందో.. కానీ పాపం ఎక్కడిక్కడ ఆమె అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. 

 

ఇంకా చెప్పాలి అంటే.. ఆ సీరియల్ లో పోయిన జన్మలో ఆస్తి కోసం చంపినా జంట మళ్లీ పుట్టి మళ్లీ ఆమెకు అడ్డు వస్తున్నారు అని వాళ్ళు ఇద్దరు కలిస్తే ఆమె మరణం ఖాయం అని అందుకు ఆ జంటను చంపేయాలని మళ్లీ సేమ్ కిడ్నప్.. సేమ్ టూ సేమ్ ప్లాన్స్ వేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ? ఆ చచ్చిన జంట మళ్లీ పుట్టి అంతే పెరిగారు కానీ.. ఈమె మాత్రం ముసలిది కాలేదు.. ఈమెని చూస్తూనే కోపం వస్తుంది అని కొందరు సీరియల్ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సీరియల్ ను తీసి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఏమో.. రెండేళ్ల నుండి అదే కథ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: