నిన్న అర్దరాత్రి సెక్స్ రాకెట్‌లో జబర్దస్త్ నటులు పట్టుబడిన సంగతి అందరికి తెలిసిందే.. ఓ మహిళతో రాసలీలలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యి పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకున్నారు జబర్దస్త్ నటులు.. ఇకపోతే ఇప్పుడు ఆ జబర్దస్త్ నటుల కారణంగా ఓ వ్యక్తికి తీవ్ర సమస్యలు వచ్చి పడ్డాయి అంటే నమ్మండి.. 

 

ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. దొరబాబుకు ఒక అతను జీరాక్స్ కాపీ ఉన్నాడు.. అతన్ని చూస్తే అచ్చం దొరబాబులనే ఉంటాడు.. కానీ అతను దొరబాబు కాదు.. అతని పేరు దావూద్. అతను కూడా హైపర్ అది స్కిట్ లో చేశాడు. దొరబాబు, దావుద్ కవల పిల్లల్లా ఓ స్కిట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచారు కూడా. 

 

ఇప్పుడు అదే సమస్య తెచ్చి పెట్టింది అని చెప్పాలి.. ఎందుకంటే.. దొరబాబు, దావుద్ ఇద్దరు ఒకేలా ఉండటంతో దావుద్ ఏ సెక్స్ రాకెట్‌లో పట్టుబడ్డాడు అని చాలామంది ఫోన్ చేసి మరి అతన్ని బండబూతులు తిడుతున్నారట.. దీంతో ఆ బూతులు తట్టుకోలేక దావుద్ మీడియా ముందుకు వచ్చి అసలు కథ అంత చెప్పేశాడు. 

 

దావుద్ మీడియాతో మాట్లాడుతూ.. ''అందరికీ నమస్కారం అండి. ఖైదీ నెం 1, డియర్ కామ్రేడ్, అర్జున్ సురవరం, భీష్మ తదితర సినిమాల్లో ఆర్టిస్ట్‌గా మంచి పాత్రల్లో నటించాను. నేను ఇందాకే దొరబాబుకు సంబంధించిన వీడియోలు చూసాను. నాకు ఆయనకు పోలికలు ఉన్నాయి. దాంతో ఆయన నేను ఒకరే అనుకుని నాకు చాలా మంది ఫోన్లు చేసి ఏంటిదంతా అని అడుగుతున్నారు.

 

 వారందరికీ ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. దొరబాబు విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. అలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. ఆయన విషయంలో ఏం జరగబోతోందో అని మీరు ఎలా ఎదురుచూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను. 

 

ఇద్దరం చూడటానికి ఒకేలా ఉంటాం కాబట్టి ఫ్రెండ్లీగానే ఉండేవాళ్లం. ఇద్దరం కలిసి జబర్దస్త్‌లో ఒక్కటే స్కిట్ చేసాం. కానీ ఎప్పుడూ ఆయన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో నేను కలగజేసుకున్నది లేదు. ఇలాంటి చీప్ పబ్లిసిటీలు నేను చేయను. వాటిని ఎంకరేజ్ చేయను. ఏదేమైనా ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది. 

 

దొరబాబుకు ముందు ముందు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు'' అంటూ వాపోయాడు ఆ నటుడు. ఏది ఏమైనా.. ఒకరు తప్పు చేస్తే మరొకరు తిట్లు తినడం అంటే ఇదే మరి.. అయినా సెలబ్రెటీలు అన్నాక ఆ మాత్రం మాటలు పడుతారు.. అప్పుడప్పుడు ఇలాంటి వివరణలు ఇచ్చుకోవాలి మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: