టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోలకి డిజాస్టర్స్ తప్పలేదు. బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అలాగే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి..కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ..మోహన్ లాల్, మమ్ముట్టి ..ఇలా సీనియర్ టాప్ హీరోలకే ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఒక దశలో అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు వరుసగా ఫ్లాపయిన సందర్భాలున్నాయి. అయినా ఆయన క్రేజ్ మాత్రం చెక్కు చేదరలేదు. అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూడా రీసెంట్ గా రిలీజైన దర్బార్ సినిమాతో కలిపి 5 ఫ్లాపులు వచ్చాయి. 

 

అయినా ఇప్పటికి ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటప్పుడు ఇప్పుడిప్పుడే హీరోగా ఒక స్టేటస్ ని సంపాదించుకుంటున్న హీరోలకి ఇలాంటి ఫ్లాప్స్ సహజంగా తప్పవు కదా. ప్రస్తుతం శర్వానంద్ తన కెరీర్లో ఇలాంటి పరిస్థితినే చూస్తున్నాడు. శతమానం భవతి తర్వాత మళ్ళీ శర్వా కి ఒక్క మంచి హిట్ దక్కలేదు. వరస ఫ్లాపులతో శర్వా మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. 'పడి పడి లేచే మనసు'.. 'రణరంగం'.. 'జాను' సినిమాలతో వరుస ఫ్లాపులను చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు.

 

అయితే ఇలా వరుస ఫ్లాప్స్ కి కారణం తనే అన్న సమాధానం శర్వాకి అర్థమైంది. ఈమధ్య శర్వా చేసిన సినిమాలు ఆ దర్శక నిర్మాతలతో ఉన్న స్నేహం కారణంగా ఒప్పుకోవడం తోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని బేరీజు వేసుకున్నాడు. స్క్రిప్ట్ విషయంలో పొరాటు చేసి ఇలా ఫ్లాప్స్ ని చూడాల్సి వచ్చిందని ఇన్నాళ్ళకి క్లారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఇకపై అలాంటి పొరపాటు చేయకూడదని కథల విషయంలో తనే స్వయంగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇలా ముందు చేసి ఉండాల్సింది కానీ అలా చేయకపోవడం తోనే తప్పు చేశానని అంటున్నాడట. 

 

ఇక శర్వా ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమాలో నటిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకరకంగా చెప్పాలంటే మరోసారి శతమానం భవతి సినిమా చూసినట్టే ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 'శ్రీకారం' రిలీజ్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని ఆ తర్వాతే కొత్త సినిమా పనులు మొదలు పెడతాడని తెలుస్తోంది. మొత్తానికి శర్వానంద్ తను తీసుకున్న గోతిలో తనే పడితేగాని తెలిసి రాలేదు. మిగతా హీరోలు కూడా తమ సినిమాల ఫ్లాప్స్ కి కారణం తెలుసుకొని మేలుకుంటే మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: