టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో వచ్చిన పోకిరి సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న ఆ సినిమాలోని సాంగ్స్ కూడా ఎంతో గొప్ప విజయాన్ని అందుకున్నాయి. మరీ ముఖ్యంగా మహేష్ బాబుతో కలిసి ముమైత్ ఖాన్ ఆడిపాడిన 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' సాంగ్ అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా ఆ పాటే వినపడేది అంటే, అది ఎంత పాపులర్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇక ఆ పాట ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించిన ముంబై భామ ముమైత్ ఖాన్, ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా ఆ తరహా ప్రత్యేక గీతాల్లో ఆడి పాడటం జరిగింది. ఆపై అక్కడక్కడ ఆమె కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు కూడా చేశారు. చూడటానికి ఎంతో మంచి ఒడ్డు, పొడుగు ఉండే ముమైత్, మధ్యలో శ్రీకాంత్ తో కలిసి నటించిన ఆపరేషన్ దుర్యోధన తో పాటు, రాజీవ్ కనకాల ప్రధానపాత్రలో తెరకెక్కిన పున్నమినాగు సినిమాల్లో ఆమె బికినీలు ధరించి అందరినీ ఒక్కసారిగా తన అందంతో కట్టిపడేసింది. 

 

ఆపై కొన్ని సినిమాల్లో అక్కడక్కడా బికినీ లో దర్శనమిచ్చిన ముమైత్ అంటే ఎంతో పడిచచ్చే అభిమానులు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎందరో ఉన్నారనే చెప్పాలి. అయితే ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలా వరకూ ఆమెకు అవకాశాలు తగ్గినప్పటికీ, మళ్లీ టాలీవుడ్ లో ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ముమైత్ చెప్పడం జరిగింది. మరి మళ్ళీ మన తెలుగు ప్రజలకు ఆమె అందాలను వీక్షించే అవకాశం ఎప్పుడు వస్తుందో, ఆ భాగ్యం ఎంతవరకు ఉందొ చూడాలి. ఇక ముమైత్ ఆ మధ్య బుల్లి తెరపై ప్రసారం అయిన బిగ్ బాస్ లో కూడా దర్శనం ఇచ్చి తన అభిమానులను అలరించడం జరిగింది.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: