రాను రాను మనిషిని మనిషి నమ్మలేని పరిస్దితులు తలెత్తుతున్నాయి.. కామం కలర్‌ఫుల్ డ్రెస్ వేసుకుని కంటికి కనిపించక ఒంట్లో దాగి ఉండగా.. అనుభవించడానికి అమ్మాయి దొరికితే చాలు. మన స్దాయి ఏంటనే విషయన్ని కూడా మరచిపోతున్నారు.. ఈ సుఖాన్ని పొందడానికి స్నేహం అనే ముసుగు వాడి, నమ్మకం అనే గొడుగును తెరచి పట్టుకుంటున్నారు.. ఇలాంటి బలహీనతకు లొంగేవారు ఎందరో ఉన్నారు.. చివరికి విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువులు సైతం శృంగారపాఠాలు నేర్పిస్తున్నారు..

 

 

ఇక సినిమా రంగంలో అయితే ఇలాంటి పరిస్దితుల గురించి చెప్పవలసిన అవసరం లేదు.. ప్రతి రాత్రి ఎందరి జీవితాలు మల్లెపువుల్లా నలిగిపోతున్నాయో అని ఇప్పటికే ఎందరో బహిరంగంగానే అంటున్నారట.. ఇకపోతే తమిళ సినీ నటుడు.. ప్రస్తుతం అన్నా డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి అయిన సూర్యకాంత్ తనయుడు.. విజయ్ హరీష్ పై, అన్నా నగర్ పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు అయ్యింది.. తనను నమ్మించి కూల్ డ్రింక్ తాగుదామని చెప్పి అందులో మత్తు మందు కలిపి ఇచ్చి తనను రేప్ చేశాడు అంటూ ఒక అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది..

 

 

ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఏ క్షణంలో అయినా విజయ్ హరీష్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో తమిళ చిత్రపరిశ్రమలో కలకలం మొదలైంది... ఇదిలా ఉండగా నటుడు సూర్యకాంత్ మాత్రం తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని.. ఇందులో భాగంగా నా కొడుకును అడ్డు పెట్టుకుని నా రాజకీయ జీవితాన్ని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అంతే కాకుండా నా కొడుకు అమాయకుడు అంటూ వెనకేసుకు వస్తున్నాడు.

 

 

ఇతని వాలకాన్ని చూసిన నెటిజన్స్ రేప్ చేసిన కొడుకును శిక్షించకుండా ఇలా నీచంగా వెనకేసుకు రావడం ఏంటీ అంటూ ఆయనపై మండి పడుతున్నారు. మరోవైపు స్నేహితుడు అని నమ్మి విజయ్ హరీష్ తో జనవరి 2న అపార్ట్ మెంట్ కు వెళ్తే.. అక్కడ మత్తు మందు ఇచ్చి నాపై అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి నన్ను లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడంటూ బాధితురాలు చెబుతుంది... ఇక ఏది నిజమో.. ఏది అబద్దమో చట్టం తేల్చవలసి ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: