టాలీవుడ్ అగ్ర నటుల్లో శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. టాలీవుడ్ లో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అగ్ర జోడి అప్పట్లో వీరిని కీర్తించింది టాలీవుడ్. వరుస విజయాలతో ఇద్దరు కెరీర్ దూసుకుపోయారు. అగ్ర దర్శకులు వీరితో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో వీరి నటనకు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మంచి హిట్ అయింది. 

 

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ఆ సినిమాలో వీరు ఇద్దరినీ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు అప్పట్లో. కొన్ని సన్నివేశాలలో వీరి నటనకు చప్పట్లు పడ్డాయి. ముఖ్యంగా చిరంజీవి శ్రీదేవి సంభాషణలు అప్పట్లో హైలెట్ గా నిలిచాయి అనే చెప్పవచ్చు. టాలీవుడ్ లో తమకంటూ చెరగని ముద్ర వేసుకుంది ఈ జోడి. ముఖ్యంగా అగ్ర నిర్మాతలు అయితే వీరితో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. దర్శకులు కూడా అదే విధంగా కథలు రాసుకునే వాళ్ళు. 

 

మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ వంటి సినిమాలు హిట్ అయ్యాయి. 80లలో శ్రీదేవి కి మంచి క్రేజ్ ఉండేది. అప్పుడే చిరంజీవి అగ్ర హీరోగా ఎదుగుతున్నారు. వీరి కాంబినేషన్ లో తమిళంలో తెలుగులో కూడా సినిమాలు విడుదల అయ్యాయి. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్ లో వీరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎస్పీ పరుశురాం సినిమా రికార్డ్స్ తిరగరాసింది. ముఖ్యంగా శ్రీదేవి నటన డాన్స్ కి ఆ సినిమాలో అభిమానులు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే రెండేళ్ళ క్రితం శ్రీదేవి బాత్ టబ్ లో పడి ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: