టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ మొత్తంగా తన సినిమా కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించారు. మొదట తేనె మనసులు సినిమాతో ప్రారంభం అయిన ఆయన సినిమా జీవితం, అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలతో ముందుకు సాగింది. ఇక కెరీర్ పరంగా ఒకేసారి ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీ బిజీ గా తన సినిమా జీవితాన్ని గడిపిన కృష్ణ, అప్పట్లో ఎందరో నూతన దర్శకులను, నిర్మాతలను టాలీవుడ్ కి పరిచయం చేసారు. ఇక ఎవరైనా నిర్మాతలు తన సినిమాల వలన నష్టపోతే, తదుపరి వారికి ఫ్రీ గా సినిమాలు చేసిపెట్టడంతో పాటు వారి మంచి, చెడులను కూడా దగ్గరుండి చూసుకునేవారట కృష్ణ. 

 

ఇక కృష్ణ మాదిరినే ఆయన తనయుడు, నేటితరం సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు కూడా ఎక్కువగా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తుంటారని చాలామంది నిర్మాతలు చెప్పడం విన్నాము. అయితే వీరిద్దరినీ అంత గొప్ప సూపర్ స్టార్లు గా నిలబెట్టడానికి వీటితో పాటు మరొక ముఖ్య కారణం కూడా ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక తనతో సినిమా చేసే దర్శకుడి మాటలకు పూర్తిగా తలొగ్గి, సినిమా కోసం దర్శకుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన సూచనలే మేరకే నటించేవారట కృష్ణ. 

 

తండ్రి కృష్ణ మాదిరిగా మహేష్ బాబు కూడా ఎవరైనా దర్శకుడి కథ నచ్చి, సినిమా చేయడానికి ఒకసారి ఒప్పుకున్న తరువాత పూర్తిగా ఆ దర్శకుడికి మహేష్ బాబు కనెక్ట్ అవుతారని, సినిమా పూర్తి అయ్యేవరకు ఏ మాత్రం స్క్రిప్ట్ విషయం లో వేలు పెట్టడం గాని, లేదా సన్నివేశాల మార్పు వంటివి గాని చేయరని అంటున్నారు. అందుకే ఎవరైనా దర్శకులు మహేష్ తో ఒక సినిమా చేస్తే చాలు, మళ్ళి మళ్ళి అందుకే ఆయనతో వర్క్ చేయాలని అంటుంటారని, ఆ విధంగా దర్శకుడికి మహేష్ పూర్తిగా సరెండర్ అవుతారని అంటున్నారు. అందుకే టాలీవుడ్ సినీ ఫీల్డ్ లో వారిద్దరూ తిరుగులేని రియల్ సూపర్ స్టార్స్ అయ్యారని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: