టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలో తల్లి, వొదిన, అత్త పాత్రల్లో నటించి మెప్పించింది సుధ.  వైవిధ్యమైన పాత్రలు పోషించగల యాక్టర్‌గా సీనియర్ నటి సుధ టాలీవుడ్‌లో మంచి పేరుంది. కోలీవుడ్ నుంచి వచ్చిన సుధ అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది.  నిండు మనిషిగా కనిపిస్తుంది.. అందుకే ఆమె తల్లి పాత్రల్లో నటించి మెప్పిస్తుంది.  గ్యాంగ్ లీడర్, ఆమె లాంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించడం అంటే అంత సామాన్య విషయం కాదు.  సినీ పరిశ్రమలో ముప్పయేళ్లకు పైగా ఉంటున్నా ఆమె కుటుంబం విషయం కానీ.. ఆమె పర్సనల్ విషయాలు ఏ ఒక్కటీ బయటకు రాకుండా చూస్తున్నారు. చాలా వరకు ఆమె మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  

 

చాలా కాలం తర్వాత ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  చిరంజీవిగారితో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌గారి ఫ్యామిలీలోని అందరితో కలిసి నేను పనిచేసాను. నాకు చిరంజీవి, నాగార్జున, బాలయ్యగారి కుటుంబాలతో మంచి అనుబంధం ఉంది.   మేజర్ చంద్రకాంత్ రామారావుగారితో పనిచేసే సమయంలో ఎంతో నేర్చుకున్నాను.  ఆయన నాకు తండ్రిలా కనిపించారు.

 

ఆయను నన్ను దగ్గరకు తీసుకొని చాలా బాగా చేశావమ్మా.. నీకు మంచి భవిష్యత్ ఉందని దీవించారు. నాకు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించే ఛాన్స్ వచ్చిందని.. కానీ ఆ పాత్ర స్కోప్ కూడా లేదు. పెద్ద పెద్ద క్యారెక్టర్స్‌లో నటించిన నేను కేవలం ఓ వస్తువులా నిలబడటానికి ఉండే పాత్ర ఇస్తే ఎందుకు చేయాలి. అందుకే ఆ సినిమా వద్దనుకున్నాను. నా పాత్రకు కాస్తైనా ఇంపార్టెన్స్ లేకపోతే ఎందుకు చేయాలి? మనసు చంపుకుని ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చేయాలి. ఇండస్ట్రీలో మనం గట్టిగా ఉంటేనే పైకి ఎదుగుతాం.. లేదంటే ఛాన్స్ దొరికితే చాలు తొక్కేయడానికి ప్రయత్నిస్తారని చెప్పుకొచ్చారు సుధ. 

మరింత సమాచారం తెలుసుకోండి: