చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లాలంటే కొంతమంది పిల్లలు ఎంత మారం చేస్తుంటారో తెలిసిందే.  ఒక వయసు వచ్చే వరకు స్కూల్ పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి పంపిస్తూ వారిని బుజ్జగిస్తుంటారు.  అయితే చిన్నతనంలో తల్లిదండ్రులకు బదులుగా సెక్యూరిటీ గార్డులు వస్తే.. అది కూడా చేతిలో గన్స్ పట్టుకొని స్కూల్ కి వస్తే తోటి పిల్లలు హడలిపోతుంటారు.  తన జీవితంలో అలాంటి పరిస్థితే జరిగిందని ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా కూతురు నటి సోనాక్షీ సిన్హా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సోనాక్షీ సిన్హా ఆ మద్య రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.   

 

తన చిన్నతనంలో హీరోగా కొనసాగిన తన తండ్రి శత్రుఘ్న సిన్హా తర్వాత రాజకీయాల్లోకి రావడం ఆయన మంత్రి హోదాలో పనిచేయడం తెలిసిందే.  ఆ సమయంలో తాను స్కూల్ కి వెళ్లనని మారాం చేసేదానని.. దానికి కారణం తన తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో చాలామంది గన్‌మెన్స్ ఎప్పుడూ తనవెంటే ఉండేవారట. కరీనాకపూర్‌ హూస్ట్ గా కొనసాగుతున్న ‘వాట్‌ వుమెన్‌ వాంట్‌’  కార్యక్రమంలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. 7వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న మంత్రి అయ్యారు.

 

ఆ సమయంలో మాకు ఉన్నట్టుండి సెక్యూరిటీ, గన్‌మెన్స్‌ ఇంకా పెరిగారు. నేను స్కూల్‌కి వెళ్తున్నప్పుడు కూడా గన్‌మెన్స్‌ నా వెనుకే వచ్చేవారు.  ఆ గన్ మాన్స్ ని చూసి నా క్లాస్ మెట్స్.. మరికొంత మంది విద్యార్థులు భయంతో వణికిపోయేవారు. వారిని చూసిన తర్వాత నాకు ఆ బాధ అర్థం అయ్యింది.. ఇంటికి వెళ్లి.. గన్‌మెన్స్‌ వస్తే నేను స్కూల్‌కి వెళ్లనని మా అమ్మవాళ్లకి గట్టిగా చెప్పాను. నిన్న నాటి నుంచే నేను ధైర్యంగా ఉంటూ వచ్చానని.. స్వతంత్రురాలిగా మొదటి అడుగు వేశానని అన్నారు సోనాక్షి సిన్హా. 

మరింత సమాచారం తెలుసుకోండి: