టాలీవుడ్ సినిమా పరిశ్రమకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి, తొలి సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా తాను తెరకెక్కిస్తున్న ప్రతి ఒక్క సినిమాతో ఒక్కో విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్లిన రాజమౌళి, ఇటీవల ప్రభాస్ హీరోగా తాను తెరకెక్కించిన అద్భుత చిత్ర రాజాలైన బాహుబలి రెండు భాగాలతో అత్యద్భుతమైన విజయాలు అందుకోవడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం అంతటా విస్తరింప చేసారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ హిస్టారికల్ మూవీని ఎంతో భారీగా తెరెకెక్కిస్తున్న రాజమౌళి, ఆ సినిమాలో హీరోలిద్దరినీ కూడా ఎంతో గ్రాండ్ లుక్ లో చూపించబోతున్నట్లు టాక్. 

 

ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు ఇతర భాషలకు చెందిన మరికొందరు కూడా నటిస్తున్నారు. అయితే నేడు ఈ సినిమా విషయమై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పెద్ద నెగటివ్ ట్రెండ్ ని నడిపిస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే, చాలా రోజులుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు మమ్మల్ని మోసం చేస్తూ సినిమాకు సంబందించి హీరోల ఫస్ట్ లుక్ కానీ, లేదా సినిమా టైటిల్ కానీ అనౌన్స్ చేయకపోవడం దారుణం అని, మధ్యలో ఎన్నో రకాల పండుగలు, ప్రత్యేక పర్వదినాలు వచ్చి వెళ్తున్నా, రాజమౌళి అండ్ టీమ్ మాత్రం ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వడం లేదని, #WeDemandRRRRUpdate పేరుతో ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నిన్న రాత్రి అతి పెద్ద ట్రెండ్ ని ట్విట్టర్ లో హోరెత్తించారు. 

 

దాదాపుగా 60కె కి పైగా ట్వీట్స్ తో ఆ ట్రెండ్ ట్విట్టర్ లో పరుగులెత్తింది. మార్చి 10 హోలీ, 14న ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఒక ఏడాది పూర్తి అవడం, అలానే 15న హీరోయిన్ ఆలియా భట్ బర్త్ డే వంటి విశేషాలు ఉన్నాయని, మేము వీటిలో ఏ రోజున ఆర్ఆర్ఆర్ అప్ డేట్ ని ఆశించవచ్చని వారు ప్రశ్నిస్తూ రాజమౌళి ని డిమాండ్ చేస్తూ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీ ల వద్దకు చేరిందని సమాచారం. మరి దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: