మాట‌ల మాంత్రికుడు  త్రివిక్రమ్ తో క‌లిసి ఎన్టీఆర్ ఓ చిత్రంలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఆ క‌థ కోసం పాత క‌థ‌ల‌న్నీ వెతుకుతున్నాడ‌ట‌. ఇక త్రివిక్ర‌మ్ టేకింగ్ అండ్ డైలాగ్స్ ఆహ్లాదంగా బాగా ఆకట్టుకొనేలా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో కొంచెం ఇతర భాషా చిత్రాలు మరియు టాలీవుడ్ పాత సినిమా వాసనలు కనిపించినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో సినిమాలో కూడా ఎప్ప‌టిలాంటి పాత సినిమాల క‌థ‌లాగే అనిపించినా టేకింగ్,డైలాగుల‌తో మాయ చేస్తాడు త్రివిక్ర‌మ్‌. 

 

ప్ర‌స్తుతం ఆయ‌న‌ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నాడు అనేది ఇప్పుడు  ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది. గత చిత్రాల వలే ఎన్టీఆర్ కోసం కూడా ఓ పాత సినిమా కథకు కొత్త హంగులు దిద్దుతాడా లేక కొత్త స్టోరీ ఏమ‌న్నా రాస్తాడా అన్న‌ది అర్ధం కావ‌డంలేదు. ఇక ఈ చిత్రం మరో రెండు నెలలో సెట్స్ మీద‌కి  వెళ్ళే ప‌నిలో  ఉంది. ఈ చిత్రం మే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు. అయితే తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం చిరు, కొర‌టాల చిత్రంలో ఎన్టీఆర్ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి రాంచ‌ర‌ణ్‌కంటే ఎన్టీఆర్ ఆర్‌.ఆర్‌.ఆర్ షూట్ త్వ‌ర‌గా అయిపోత‌ద‌ని అందుకే ఎన్టీఆర్ చేస్తారని కొన్ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజ‌నిజాలు ఉన్నాయి అన్న‌ది మాత్రం తెలియ‌దు. 

 

ఎన్టీఆర్ ముందనుకున్న మ‌హేష్ పాత్ర‌లో న‌టిస్తాడా లేక మ‌హేష్‌తో క‌లిసి న‌టిస్తాడా అన్న‌ది ఒక కొత్త ట్విస్ట్ వినిపిస్తోంది. మ‌రి ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న విష‌యం తెలియాల్సి ఉంది.  ఇటీవ‌లె విడుద‌లైన ఓ పిట్ట‌క‌థ చిత్రానికి ఎన్టీఆర్ స‌పోర్ట్ చేస్తున్నారు. విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు . చెందు ముద్దు దర్శకుడు.  కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి టీమ్ కి త‌న సోష‌ల్ మీడియా ద్వారా విషెస్‌ని తెలిపారు. సంజయ్ అండ్ నా ఫ్రెండ్ బ్రహ్మాజీకి అలాగే ‘ఓ పిట్టకథ’ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ అని ఆయ‌న స‌పోర్ట్ చేశారు.ఇక ఈ వారం ఎన్టీఆర్ సినిమా ప్రోగ్రెస్  ఇదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: