హ్యాపీడేస్ సినిమాతో కాలేజ్ స్టోరీలకి కొత్త మార్కుని తీసుకు వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల సున్నితమైన ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో ఎక్స్ పర్ట్. సున్నితమైన భావోద్వేగాలని తన సినిమాల్లో చాలా అందంగా ప్రతిబింబించేలా చేస్తాడు. ఆనంద్ సినిమా నుండి మొన్నటి ఫిధా వరకు ఒక్కో ప్రేమ కథకి ఒక్కో విశిష్టత ఉంటుంది ప్రేమ కథలని తీయడంలో తనదైన ముద్ర వేసిన కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే

 

 

అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుండి జరుపుకుంటుంది. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన కథగా ఉంటుందట. దీనికోసం నాగచైతన్య తెలంగాణ యాసని కూడా నేర్చుకున్నాడట. ఇటీవల ఈ సినిమా నుండి ఏయ్ పిల్లా అంటూ చిన్న మ్యూజిక్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఒక్క వీడియోతో లవ్ స్టోరీ సినిమాపై బాగా అంచనాలు పెరిగాయి.

 

 

ఈ సమ్మర్ లో మరో మంచి ప్రేమకథని చూడబోతున్నాం అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తవడానికి మరింత సమయం పడుతుందట. శేఖర్ కమ్ముల ఈ సినిమాని చాలా నెమ్మదిగా తెరకెక్కిస్తున్నారట. తనకు నచ్చిన విధంగా రావడానికి సినిమాని బాగా చెక్కుతున్నాడట. ఆ విధంగా చూసుకుంటే లవ్ స్టోరీ చిత్రం సమ్మర్ లో వచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు.

 

 

వర్షాకాలం మొదట్లో గానీ, మధ్యలో గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయట. ఒకవేళ అలాగే జరిగితే నాగచైతన్య తర్వాతి సినిమాలు మరింత ఆలస్యం కానున్నాయి. మరి శేఖర్ కమ్ముల ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో... 

మరింత సమాచారం తెలుసుకోండి: