చైతన్యకి పెళ్ళైన తర్వాత బాగానే కలిసొచ్చిందని దాదాపు ఆయన నటించిన చిత్రాలన్నీ హిట్ కొట్టాయి. అందులో స్యామ్ చై కలిసి నటించిన `మజిలీ` చిత్రం ఇంకా సూపర్‌డూపర్ హిట్ కొట్టింది.ఇక ఆయన కథల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలతో పాటు కథాబలమున్న చిత్రాల్నే ఎంచుకుంటున్నారు. అంటే ఆయన నటించే సినిమాల్లోని కథలు బహుశా సమంత సెలెక్ట్ చేస్తుందా ఏంటి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో నాగచైతన్యలో మార్పు మొదలైంది. తాజాగా చై నటిస్తున్న చిత్రం `లవ్‌స్టోరీ`. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్‌పై గత కొన్ని రోజులుగా భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అది కుదరలేదు. దాంతో ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ నారంగ్, పి. రామ్మోహన్రావు ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంటరవుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేస్తే అన్ని విధాలా బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట.
అయితే ఇందులో నాగచైత్య జిమ్ ట్రైనర్‌గా, సాయి పల్లవి మ్యూజిక్ టీచర్‌గా కనిపించబోతున్నారు. ఇద్దరూ ఉత్తర తెరంగాణలోని మారుమూల గ్రామం నుంచి సిటీకి వచ్చిన వారిగా పక్కా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. ఇదే ఈ చిత్రానికి సేలింగ్ పాయింట్‌గా శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. మరి ఈ మధ్య వచ్చే చిత్రాలన్నీ ఎక్కువగా తెలంగాణ స్లాంగ్‌ని వాడటం బాగా ఫ్యాషన్ అయిపోయింది. తెలంగాణ అమ్మాయి కథతో `ఫిదా` చిత్రాన్ని రూపొందించి శేఖర్ కమ్ముల సక్సెస్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన `హేయ్ పిల్లా.. లిరికల్ వీడియోని ఈ నెల 11న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.