టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాల్లో ముందుగా ఆయన పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న వకీల్ సాబ్ మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోర్ట్ డ్రామా మూవీ అయిన పింక్ కు అధికారిక రీమేక్ గా దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు పవన్ ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభించగా, రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తూ ముందుకు సాగుతోంది. 

 

ఇప్పటికే యూట్యూబ్ లో పలు రికార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సాంగ్, ప్రస్తుతం 5 మిలియన్లకు పైగా వ్యూస్, అలానే 492కె లైక్స్ అందుకుని అతి త్వరలోనే 500కె లైక్స్ కు చేరువ అవబోతోంది. ఎస్ ఎస్ థమన్ అద్భుతమైన ట్యూన్ ని అందించిన ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి, మహిళా శక్తి యొక్క గొప్పతనాన్ని చాటేలా ఎంతో గొప్ప సాహిత్యాన్ని అందించడంతో పాటు యువ సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ ని ఎంతో హృద్యంగా ఆలపించడం జరిగింది. ఇప్పటికే తెలుగులో ఆయన పాడిన పలు సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకోగా, ప్రస్తుతం వాటి సరసన ఈ మగువ మగువ సాంగ్ కూడా చేరింది. 

 

ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, అనన్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా హిందీ వర్షన్ ను కొంత మార్చి యువ దర్శకడు వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా రెండేళ్ల గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందని అంటున్నారు నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: