ముమైత్ ఖాన్... టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐటెం గర్ల్. స్టార్ హీరోలు అందరి సినిమాల్లో ఈమె ఐటెం గర్ల్ గా చేసింది. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో ఈమె వేసిన ఐటెం సాంగ్ సాంగ్ అప్పట్లో యూత్ ని ఊపేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె అక్కడి నుంచి సెక్సీ బాంబ్ అయిపోయింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఆమె డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో వెంట వెంటనే అవకాశాలు వచ్చాయి. 

 

ప్రభాస్ హీరోగా రెండు మూడు సినిమాల్లో ఆమె ఐటెం సాంగ్స్ చేసింది. ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి సినిమాలో ఈమె పాట హైలెట్ అయింది. సినిమా హిట్ అయినా సరే ఈమె తన పాట తో ఆకట్టుకుంది. ఆ తర్వాత బుజ్జిగాడు సినిమాలో మళ్ళీ ఐటెం సాంగ్ చేసింది. సిల్క్ స్మిత లోటు తీర్చింది అని కొందరు అప్పట్లో అభిప్రాయపడ్డారు కూడా. అయితే ఆమె ఎక్కువ కాలం నిలబడలేదు. సోలోగా సినిమాలు కూడా చేసింది. హీరోయిన్ గా ట్రై చేసినా సరే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక పారితోషికం కూడా ఎక్కువగా తీసుకునేది అనే పేరు ఉంది ఆమెకు. 

 

దీనితో కొందరు దర్శక నిర్మాతలు ఆమె పేరు చెప్తే చాలు అప్పట్లో భయపడ్డారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆమెకు అవకాశం వచ్చినా రెగ్యులర్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేస్తున్న నేపధ్యంలో ఇక ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసారు దర్శకులు. అవకాశం వచ్చినా సరే ఆమె ఒకప్పుడు వాడుకోలేదని ఆ ఆగ్రహం తోనే ఆమెకు అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా వెనక్కు తగ్గారని కొందరు అంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా ఆమెను ఇబ్బంది పెట్టాయని ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: