ఈ మ‌ధ్య కాలంలో జేడీ చక్రవర్తి విలక్షణమైన పాత్రలను న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన జోన‌ర్‌ని సంపాదించుకున్నాడు. అలా ఆయన చేసిన 'ఎమ్ ఎమ్ ఓ ఎఫ్' సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమాకి, ఎన్.ఎస్.సి. దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడ‌దుల‌ చేశారు. ఇక ఈ చిత్ర ట్ర‌యిల‌ర్‌ను జేడీ వాయిస్ ఓవర్ పై కట్ చేశారు. ఆ వాయిస్‌తో మొత్తం ఆసక్తిని రేకెత్తించేలా చేశారు. 

 

ఇక ఈ ట్ర‌యిల‌ర్ చూసిన‌ప్పుడు చాలామంది అర్ధం కాలేదు అని కామెంట్స్ చేశారు. ఆఖ‌రికి గెస్ట్‌గా వ‌చ్చిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో సహా ట్ర‌యిల‌ర్ అర్ధం కాలేదన్నారు. మ‌రి సినిమా ఏ మేర‌కు మెప్పిస్తుందో వేచి చూడాలి. కాని ట్ర‌యిల‌ర్ చూసినంత సేపు ఏదో ఒక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లా మాత్రం అనిపించింది. ఇక ప్రమాదంలో జేడీ ఓ ప్ర‌మాదంలో చిక్కుకుంటాడు. దాని నుంచి ఆయ‌న‌ బయటపడాలనుకుంటాడు. తనకన్నా పెద్ద ప్రమాదంలో తన చెల్లెలు ఉందనే విషయాన్ని ఆ సమయంలోనే ఆయన గ్రహిస్తాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? అన్నా చెల్లెళ్లను చుట్టుముట్టిన ఆ ప్రమాదం ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి మ‌న‌కు అర్ధ‌మ‌వుతుంది. అయితే స‌స్పెన్స్‌తో కూడుకున్న ఈ ట్ర‌యిల‌ర్ ప్రేక్ష‌కుల అంచనాలు పెంచుతున్న ఈ సినిమా జేడీకి హిట్ తెచ్చిపెడుతుంతో లేదో తెర‌మీద‌ చూడాలి మ‌రి.

 

మ‌రి ఇక్క‌డ‌కి గెస్ట్‌గా వ‌చ్చిన రామ్‌గోపాల్‌వ‌ర్మ ఈచిత్ర ట్ర‌యిల‌ర్‌ని ఆవిష్క‌రించారు. అలాగే టైటిల్ కూడా కొంచం కొత్త‌గా ఉంది. అస‌లు ఎంఎంఎఫ్ అంటే ఎబ్రివేష‌న్ ఏంట‌న్న‌ది మాత్రం స‌స్పెన్స్‌గా ఉంచారు. ఆఖ‌రికి వ‌ర్మ‌ని అడిగినా కూడా ఏమో తెలియ‌ద‌న్నారు. ఇక ఆయ‌న మ‌న‌కు తెలిసిన విష‌యం గురించి అయితే పెద్ద‌గా ఆలోచించ‌ము. తెలియ‌క పోతేనే క‌దా అస‌లు ఏంటి ఏం చూపించ‌బోతున్నాడు అని ఎగ్జైట్ అవుతాము అని అన్నారు. 
 ఇక అలాగే ఇక్క‌డ‌కు విచ్చేసిన చాలా మంది పెద్ద‌లు జెడిని, వ‌ర్మ‌ని క‌లిపి మాట్లాడుతున్నారు. వారిద్ద‌రి మ‌న‌స‌త్వం చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని అర్ధం చేసుకోవ‌డం కాస్త క‌ష్ట‌మ‌న్న‌ట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: