తెలుగు సినిమాలో ఐటం సాంగ్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో అయితే అవి చాలా స్పెషల్ గా ఉంటాయి. ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు దర్శకులు వారికి నచ్చినట్టుగా ఈ స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేస్తారు. ఈ ఐటం సాంగ్స్ కోసం స్పెషల్ గా కొంతమంది ఉండేవారు. అయితే వాటికి విపరీతమైన క్రేజ్ రావడంతో ఈ సాంగ్స్ కోసం హీరోయిన్స్ కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది. సినిమాకు అవసరమైన టైం లో వచ్చే ఈ ఐటం సాంగ్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి.

 

ఇక ఈ సాంగ్స్ ప్రత్యేకంగా మాస్ ఆడియెన్స్ కోసం డిజైన్ చేస్తారు. మంచి మాస్ సినిమాకు అదే రేంజ్ లో ఒక మాంచి మాస్ మసాలా ఐటం సాంగ్ ఉంటే అదనపు ఆకర్షణగా ఉంటుంది. మాస్ ఆడియెన్స్ మాత్రమె కాదు క్లాస్ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేసేలా ఈ స్పెషల్ సాంగ్స్ ఉంటాయి. దశాబ్దం క్రితం అయితే ఐటం సాంగ్ లేని సినిమా ఉండేది కాదు. అయితే కథలలో మార్పు రావడంతో ఐటం సాంగ్స్ కూడా తక్కువయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ ప్రత్యేక సాంగ్స్ కు సై అనడంతో వీటికి క్రేజ్ పెరిగింది.

 

క్లాస్ సినిమా.. మాస్ అన్న తేడా లేకుండా ఈ ఐటం సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్స్ చేస్తుండటం వల్ల ఆ సాంగ్స్ మరింత ఆకర్షణగా మారాయి. పబ్బులు, స్పెషల్ సెట్, దాబా ఇవన్ని ఐటం సాంగ్స్ కు వాడుతారు. రానున్న రోజుల్లో ఐటం సాంగ్స్ లో కూడా ఎక్స్ పెరిమెంట్స్ చేసేలా ఉన్నారు. కొంతమంది ఆడియెన్స్ కోసమే అయినా తెలుగులో ఐటం సాంగ్స్ రావాలని కోరుకుంటున్నారు. మరి దర్శక నిర్మాతలు ఈ ఐటం సాంగ్స్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది.   

  

మరింత సమాచారం తెలుసుకోండి: