తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న వారిలో సమీరా రెడ్డి ఒకరు. తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. అయినా సరే ఐటెం సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేసింది. అయినా సరే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో ఆమె ఐటెం సాంగ్స్ చేసింది. అయినా సరే ఆమెకు సరైన అవకాశాలు రాలేదు అనే చెప్పాలి. తెలుగులో కూడా కొన్ని పాటలు చేసినా ఆమెకు డాన్స్ రాదని అన్నారు కొందరు. ఐటెం సాంగ్స్ లో డాన్స్ చాలా కీలకం. 

 

కాని ఆమెకు డాన్స్ రాదని అందుకే చాలా మంది దర్శకులు ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చింది అని అంటున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె రెండు సినిమాలు చేసారు. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అశోక్, నరసింహుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చిరంజీవి తో చేసిన జై చిరంజీవ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీనితో ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు. దీనితో బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడ కూడా ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 

 

ఐటెం సాంగ్స్ చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీనితో ఆమె సినిమాలకు దాదాపుగా దూరమైంది. తెలుగులో ఆమె చివరి సారిగా కృష్ణం వందే జగద్గురుం సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. తెలుగులో ఆమె తక్కువ సినిమాలే చేసినా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఐపిఎల్ కి కూడా ఒక సాంగ్ చేసింది. సమీరా గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు 1996లో గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ యొక్క "ఔర్ ఆహిస్తా" మ్యూజిక్ వీడియోలో మొదటిసారి నటించింది. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. ఒక సోదరి మేఘన (మోడల్), మరొక సోదరి సుష్మ (బాలీవుడ్ నటి మరియు మోడల్).

మరింత సమాచారం తెలుసుకోండి: