టాలీవుడ్ లో ఎన్నో క్యారెక్టర్స్ పాత్రల్లో నటించి తన సత్తా చాటుతున్నారు నటుడు చత్రపతి శేఖర్.   బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఆయన వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు.  శేఖర్ మొదట బుల్లితెరపై నటించి వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో ఛాన్సులు దక్కించుకున్నారు.  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి’ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా ముఖ్య భూమిక పోషించాడు. ఈ మూవీ శేఖర్ కి ఎంతో మంచి పేరు తీసుకు వచ్చింది.. దాంతో అప్పటి నుంచి తన ఇంటి పేరు చత్రపతిగా మార్చుకొని చత్రపతి శేఖర్ గా పిలవబడుతున్నాడు. 

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చత్రపతి మూవీ షూటింగ్ లో ఓ భయంకరమైన సంఘటన గురించి చెప్పారు.   రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో  ఓ షిప్ లో ప్రభాస్ తో పాటు తాను కూడా పాల్గొన్నానని... అయితే అనుకోకుండా  నేను పట్టుతప్పి షిప్పులో నుంచి నీళ్లలోకి జారిపోయాను. వెంటనే ప్రభాస్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు.  అయితే ప్రభాస్ మంచి బలంగా ఉండలంతో నన్ను ఉపిరి ఆడనంతగా  గట్టిగా పట్టుకున్నాడు.. కానీ ఆయన అలా పట్టుకోవడం వల్లనే నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానని.. లేదంట నేను నీళ్లలో పడిపోతే డైరెక్ట్ గా ఫ్యాన్ మద్యలో పడి నా ప్రాణాలు పోయి ఉండేవి. 

 

అది గమనించే ప్రభాస్ తనను గట్టిగా పట్టుకొని నెమ్మదిగా పైకి లాగారు.. అలా నేను ప్రాణాలతో బయట పడ్డాను.  అయన కాపాడకపోయి వుంటే, ఆ గండం నుంచి నేను బతికి బయటపడే వాడిని కాదు అని చెప్పుకొచ్చాడు. కొన్ని సార్లు మనం ఊహించనవి జరుగుతుంటాయి.. అప్పడు కొంత మంది దేవుడిలా వచ్చి మనల్ని ఆదుకుంటారు.. నిజంగా ప్రభాస్ చేసిన మేలు తన జీవితంలో మర్చిపోలేనని అన్నారు.  మన హీరో రిల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: