టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో పరిచయం అయిన నిఖిల్ తర్వాత సోలో హీరోగా నటించాడు.  మొదట్లో ఇబ్బంది పడ్డా స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ ఇలా వరుస విజయాలు అందుకున్నాడు.  టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో నిఖిల్ కి మంచి లక్ కలిసి రావడంతో చిన్న నిర్మాతలకు మనోడు కల్పతరువు అయ్యాడు. కానీ, ఎప్పుడు విజయాలు వెంటనే ఉండవు.. ఈ మద్య నిఖిల్ కి పరాజయాలు వస్తునే ఉన్నాయి. గత ఏడాది అర్జున్ సురువరం కాస్త పరవాలేదు అనిపించింది.

 

ఈ మద్య నిఖిల్ ఎంగేజ్ మెంట్ అయ్యింది.  వచ్చే నెల 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన డాక్టర్ పల్లవీ వర్మను వివాహం చేసుకోబోతున్నాడు నిఖిల్.  పెళ్లి అయితే చేసుకుంటున్నాడు కానీ, వెంటనే హనీమూన్ కు వెళ్లే అవకాశం నిఖిల్ కు లేదట.  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హనీమూన్ కు వెళ్లలేకపోవడానికి కారణం  2014లో మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చి మంచి విజయం సాధించిన 'కార్తికేయ' సినిమా సీక్వెల్ గా ఓ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.  గతంలో ఈ సినిమాతోనే మనోడికి లైఫ్ టర్న్ అయిన విషయం తెలిసిందే.

 

అందుకే ఈ మూవీకి ఎలాంటి అంతరాయం లేకుండా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాడట. దసరాకు సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తూ ఉండటంతో, షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది.  ఈ నేపథ్యంలోనే పెళ్లికి కూడా ఎక్కువ టైమ్ తీసుకోకుండా కేవలం ఐదు రోజులు మాత్రమే కేటాయిస్తున్నాడట. ఈ సినిమాలో దాదాపు 5 వేల ఏళ్ల నాటి రహస్యాలను ప్రస్తావించబోతున్నామని, సంప్రదాయాలు, చరిత్రలను ఎలా మరచిపోతున్నామన్న విషయమై చర్చ కూడా ఉంటుందట.  ఈ మద్య కార్తికేయ సీక్వెల్ కాన్సెప్ట్ వీడియో విడుదల కాగా, అది వైరల్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: