ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు  తాత నందమూరి తారక రామారావు చరిష్మా ఉందని  తెలుగు ప్రేక్షకులు నందమూరి అభిమానులు అంటుంటారు. అందుకే నందమూరి ఫ్యామిలీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ... జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఎవ్వరికి లేదు అని చెప్పాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ ఏ పాత్రలోనైనా చూసే అభిమానులు అందరూ ఔరా అనిపించేలా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు  జూనియర్ ఎన్టీఆర్. 

 

 

 ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయాల్లోకి వస్తారా..?  రారా..?  అనే అనుమానం ప్రస్తుతం నందమూరి అభిమానుల్లోనే కాదు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఉంది. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు సలహా మేరకు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి రాజకీయాలకు దూరమైపోయారు జూనియర్ ఎన్టీఆర్. అయితే 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. పార్టీ కీలక నేతలు అందరూ పార్టీని వీడుతుండటంతో ... పార్టీకి కొత్త అధ్యక్షుడు రావాలనే డిమాండ్ కూడా తెర మీదకు వస్తున్నది. 

 

 

 ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని ఎంతోమంది ఇప్పటివరకు చెప్పకనే చెప్పారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి పార్టీ ని నడిపేంత  సీన్ లేదని... జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఎంతోమంది టీడీపీ నేతలు కూడా నమ్ముతున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ వాక్చాతుర్యం... అతనికి సబ్జెక్టు మీద ఉన్న పట్టుతో పార్టీని విజయవంతంగా నడిపించగలడు అని నమ్ముతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రాజకీయాల వైపు అయితే తిరిగి చూడలేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: