సినిమా లొకేష‌న్‌ల‌లో క్యార‌వాన్‌లు ఉండ‌డం వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోతున్నారని కొంత మంది సినీ ప్ర‌ముఖులు అంటున్నారు. అయితే దానికి కార‌ణాలు లేక‌పోలేదు. ఒక‌ప్పుడు కార‌వాన్‌ అనేది అవ‌స‌రానికి మాత్రం వాడేవారు. కానీ ప్ర‌స్తుతం అలా కాదు. హీరోలు లొకేష‌న్‌లో కంటే కూడా కార‌వాన్‌లోనే ఎక్కువ‌గా ఉంటున్నార‌ట‌. ఇటీవ‌లె దీని పై ఇండ‌స్ట్రీ పెద్ద‌లు స్పందించారు. వాళ్ళ స్పంద‌న ఏంటో చూద్దాం...

 

చిరంజీవి మాట్లాడుతూ...ఒక ప‌దేళ్ళ గ్యాప్‌లో ప‌రిశ్ర‌మ‌లో ప‌రిస్థితులు చాలా మారిపోయాయి అన్నారు. శంక‌ర్‌దాదా ఎంబిబిఎస్ చేస్తున్న స‌మ‌యంలో అప్పుడు మాకు కార‌వాన్‌లు లేవు. ఇందాక‌డ నిత్య మాట్లాడుతూ కార‌వాన్‌ ఉంటే బావుండేది లేదు. అంటుంటే... పాపం లేడీస్‌కి ఇంపార్టెంట్ కార‌వాన్‌ ఉంటే బావుండేది అనుకున్నా.ఇక కార‌వాన్‌ అనేది ఎవ‌రికైనా కూడా చాలా కంఫ‌ర్ట్‌ని ఇస్తుంది. ఇక ఆ కంఫ‌ర్ట్‌ని మినిమం నెసిసిటీ వ‌ర‌కు వాడుకుంటే బావుంటుందిగాని...షూటింగ్‌లో ల‌గ్జ‌రీకి ఎరైవ్‌గా వాడుకునే ప‌రిస్థితికి మారిపోయింది. కార‌వాన్‌లో కూర్చున్న ఆర్టిస్ట్‌ని పిల‌వ‌డానికి ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్ జీవితం అక్క‌డే అయిపోతుంది. వాడి జీవితం అక్క‌డే డెడికేష‌న్ అయిపోత‌ది. కార‌వాన్‌ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌టం వెంట తీసుకురావ‌డం.. తీసుకువెళ్ళ‌డం తోనే అయిపోత‌ది త‌ప్పించి వాడు డైరెక్ష‌న్‌లో నేర్చుకునేది అంటూ పాపం ఏమీ ఉండ‌దు. దీనిలో మార్పు రావాలి. ఇందులో ఆ డెడికేష‌న్ తీసుకురావాల‌న్న‌ది నా కోరిక‌. నేనైతే మాత్ర కార‌వాన్‌ అనేది మేక‌ప్ చేసుకోవ‌డానికో బ‌ట్ట‌లు మార్చుకోవ‌డానికో, వాష్‌రూమ్ అంతే త‌ప్పించి వేరే దేనికి వాడ‌ను. పూర్వంలాగానే ఇదివ‌ర‌కులాగానే అలానే ఉంటాను. ఎప్పుడూ నేను లొకేష‌న్‌లోనే ఉంటాను అలా లొకేష‌న్‌లో బాధ్య‌త క‌లిగిన హీరో హీరోయిన్లు ఉండ‌టం వ‌ల‌న వ‌ర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా చాలా బాధ్య‌త‌గా జ‌రుగుతుంది.  ఒక‌వేళ మ‌నం వెళ్ళి రిలాక్స్ అయిపోతే వాళ్ళు ఎంత‌లేద‌న్నా రిలాక్స్ అవుతారు. కెమెరామెన్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు ఇలా దాని వ‌ల్ల ఎంతో అవుట్‌పుట్ అనేది తగ్గిపోతుంది. ఎంతో స్పిరిట్ ఉండాలంటే గ‌నుక హీరో, హీరోయిన్స్ అన్న‌వాళ్ళు స్పాట్‌లో ఉండాలి ఉండ‌గ‌లిగితేనే మ‌నం జ‌స్టిఫై చేస్తున్న‌ట్లు మ‌న‌ప‌నికి మ‌నం న్యాయం చేస్తున్న‌ట్లు. అలాంటి పరిస్థితి రావాలే త‌ప్పించి ఏముందండి... మ‌న‌కు ఆల్రెడీ గొడుగులు ప‌ట్టుకునేవారు ఉంటారు. అవుట్‌డోర్ అయితే డేటా వేసేవాళ్ళు ఉంటారు. ఇండోర్ అయితే అస‌లు ప్రాబ్ల‌మే లేదు. కానీ ఎందుకు మాటి మాటికి కార‌వాన్లోకి  వెళ్లిపోవాలి. షాట్ అవ్వ‌గానే ఎందుకు వెళ్ళాలి. అదొక స్టేట‌స్ సింబ‌ల్ ప్ర‌స్టేజ్ అయిపోయింది త‌ప్పించి. మిగ‌తా చిన్న చిన్న ఆర్టిస్టులు వెళ్ళికూర్చుంటే సెట్‌లో ఉంటే అవ‌మానం అనుకోకూడ‌దు. మ‌నం సెట్‌లోనే ఉండాలి. అవ‌స‌ర‌మొస్తే త‌ప్పించి కార‌వాన్‌లోకి వెళ్ళ‌కూడ‌దు. ఈ చిన్న విష‌యాన్ని గ‌నుక మ‌నం గ‌మ‌నించ‌గ‌లిగితే ఇది చాలా పెద్ద ఎత్తున మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌, కెమెరామెన్ చాలా ఆనందంగా ఫీల‌వుతారు. ఎంత మంచి మార్పు వ‌చ్చింద‌ని ఫీల‌వుతారు. 140 రోజులు అవ్వ‌వ‌ల‌సిన సినిమా 100రోజుల్లో అయిపోయేందుకు అన్ని ర‌కాల అవ‌కాశాలు ఉన్నాయి. 

 

త‌మ్మారెడ్డిభ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ... చిరంజీవిగారు చెప్పిన‌ట్లు కార‌వాన్‌లోకి వెళ్ళి కూర్చుంటే చాలు పిలిచిన‌ప్పుడు వెళ‌దాం. అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు లేబ‌ర్‌ముండాకొడుకుల్లాగా వాళ్ళు వ‌చ్చి బ‌య‌ట నుంచుని ఈ ద‌రిద్రం అంతా లేకుండా...ఎంత హిములియేట్ అవుతాడు ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అనేవాడు అన్న‌ది తెలుసుకోవాలి. ఏదో ఒక టీనేజ్ కుర్రాడు 20ఏళ్ళ కుర్రాళ్ళు వ‌స్తారు ఏదో ప‌ని నేర్చుకోవ‌డానికి వాళ్ళు వ‌చ్చి హీరోల‌ద‌గ్గ‌ర‌, హీరోయిన్ల ద‌గ్గ‌ర స‌పోర్టింగ్ ఆర్టిస్ట్‌ల వ‌ద్ద కార‌వాన్‌ల ద‌గ్గ‌ర బ‌య‌ట నుంచుని సార్ షాట్ రెఢీ అని వాడు లోప‌లికి పిల‌వ‌డు బ‌య‌ట‌కి రాడు. వ‌చ్చేదాకా వెయిట్ చేసి రావాలంటే ఎంత విసిగిపోతాడు. వాడు త‌ర్వాత ఫ్యూచ‌ర్‌లో డైరెక్ట‌ర్ అవ్వ‌డం సంగ‌తి ఏమోగాని ముందు ఈ స్ర‌ప‌ష‌న్‌తో వాడు శాడిస్ట్ అయిపోతాడు. వాళ్ళ‌ని కాపాడ‌ట‌మంటే యాటిట్యూడ్స్ మారాలి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: