ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ స్టార్ గా ఉన్న ఒక హీరో ఈమధ్య బాగా డబ్బు మనిషి అయ్యాడట. తను చేసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వడం తో మరింత డిమాండ్ పెరిగింది. అతనితో సినిమా అంటే చాలు నిర్మాతలు క్యూ కడతారు. రెండేళ్ల నుండి వరుస హిట్లు కొడుతున్న ఈ హీరోతో సినిమా నిర్మాతకు లాభాలు తెస్తున్నా ఈమధ్య హీరోలో మార్పు వాళ్లకి షాక్ ఇస్తుంది. 

 

ఎవరైనా డైరెక్టర్ కథ చెప్పడానికి వస్తే నిర్మాత ఎవరన్నది అడుగుతాడట.. ఆ హీరో సినిమా అంటే నిర్మాతలు వస్తారు కాని తను చెప్పిన నిర్మాతల తోనే అతను సినిమా తీయాల్సి ఉంటుంది. నిర్మాతల గురించి హీరోకి ఎందుకు అంటే సినిమాకు రెమ్యునరేషన్ గా కాకుండా షేర్ అడగడం అతనికి అలవాటు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి అతను ఎలా చెబితే డైరెక్టర్ అలా చేయాలి. అంతేకాదు నిర్మాతలు కూడా అతని చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది. 

 

ఆ హీరోతో సినిమా అంటే ముందు రెమ్యునరేషన్.. షేర్ లెక్కలు తేలాకే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. అయితే ఒక్కసారి కమిట్ అయితే మాత్రం ఆ హీరో ఇంకా పూర్తి కమిట్మెంట్ తో పనిచేస్తాడు. నిర్మాతతో కలిసి సినిమాను సమర్పిస్తూ రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ లాగేస్తున్నట్టు చెప్పాడు. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో డబ్బుకి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం అది బయటకు రావడం చూసి ఆయన ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే తను అలా చేయడానికి కారణం ఉంది అంటున్నారు. సినిమాకు కావాల్సిన కష్టం పడుతున్నప్పుడు తనకు రావాల్సినది రాబట్టే ప్రయత్నంలో భాగంగానే ఆ హీరో అలా చేస్తున్నాడని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్స్ లో అతనే నంబర్ 1, 2 లో ఉన్నాడని తెలుస్తుంది. రీసెంట్ గా ఆయన ప్రొడక్షన్ నుండి సినిమా కూడా మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: