దుమ్ము రేపే డాన్స్ తో... కళ్ళు చెదిరే యాక్షన్ తో.. మెస్మరైజ్ చేసే స్టైల్  తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఎప్పుడు అందరితో సరదాగా ఉంటూ తన ఆటిట్యూడ్ తో  కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఈ స్టార్ హీరో కి ఎంతో మంది మహిళా అభిమానులు ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎందు కంటే ఎక్కువగా అమ్మాయిలను అల్లు అర్జున్ ఆటిట్యూడ్ బాగా ఆకర్షిస్తూ ఉంటుంది.

 

 

 అది సినిమాల్లో అయినా నిజజీవితంలో అయినా అల్లు అర్జున్ ఆటిట్యూడ్ కి బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు అమ్మాయిలు. అలాంటి అల్లు అర్జున్ ను  ఒక్క చూపుతోనే ప్రేమ లో పడేసింది స్నేహ రెడ్డి. స్నేహారెడ్డితో అల్లు అర్జున్ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు వీరి లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి. స్నేహ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త కట్ట శేఖర్ రెడ్డి కూతురు. స్నేహ రెడ్డి అమెరికాలో ఎం.ఎస్ చేసింది. ఇక ఎమ్మెస్ చేసి ఇండియాకు వచ్చిన సమయంలో... స్నేహ రెడ్డి ఓ స్నేహితురాలి పెళ్లికి వెళ్ళగా అదే పెళ్లికి అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడు. ఈ సమయంలోనే స్నేహారెడ్డి అల్లు అర్జున్ కంటపడింది. ఇక అక్కడ మొదలైంది వీరి పరిచయం. 

 

 

 ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే అల్లు అర్జున్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే చెప్పాలి. మామూలుగానే అల్లు అర్జున్ అమ్మాయిలను పడేయటం లో  దేశముదురు... ఇక స్నేహారెడ్డితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మార్చడానికి అల్లు అర్జున్ కి ఎన్నో రోజులు పట్టలేదు. ఏకంగా ఓ రోజు సమయం చూసుకొని అల్లు అర్జున్ స్నేహారెడ్డి కి ప్రపోజ్ కూడా చేశాడట. ఇక అటు స్నేహ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి పడిపోయి ప్రపోజల్ కి ఓకే చెప్పేసిందట. కానీ వీరిద్దరి పెళ్ళికి మొదట పేరెంట్స్ ఒప్పుకోకపోయినప్పటికి...  ఆ తర్వాత మాత్రం అంగీకరించి పెళ్లి జరిపించారు . ప్రస్తుతం ఈ ఇద్దరి దంపతులకు ప్రేమకు గుర్తుగా.. అయాన్,  అర్హలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: