సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు మొన్నటివరకు వినబడ్డాయి. బీజేపీతో కలిసి పని చేస్తారు లేకపోతే డిఎంకెలో చేరుతారు ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అదే టైం లో కొత్త పార్టీ పెడతారన్న వార్త కూడా గట్టిగా వైరల్ అయ్యింది. ఇటువంటి తరుణంలో వాటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ కొత్త పార్టీ పెట్టడానికి రజినీకాంత్ రెడీ అవటం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. మామూలుగా అయితే తమిళ రాజకీయాలు డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీల హవా కొనసాగుతోంది. ఎప్పుడూ కూడా జాతీయ పార్టీలను తమిళ ప్రజలు మద్దతు తెలిపిన దాఖలాలు లేవు. ఇటువంటి టైం లో ఇటీవల మీడియా సమావేశం పెట్టి రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

సొంత పార్టీ పెట్టి మంచి ప్రతిభ ఉన్న యువకులకు పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు కేవలం తాను అధ్యక్షుడిగా మాత్రమే రాణిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ దేవుడి దయవల్ల గెలిచాడు ముఖ్యమంత్రి స్థానం కూడా తీసుకోను అని తెలిపారు. మరియు అదే విధంగా ప్రభుత్వ నిర్ణయాల లో కూడా నా ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. దీంతో ఇంత సడన్ గా రజనీకాంత్ పొలిటికల్ వ్యాఖ్యలు చేయటం పట్ల సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినబడుతున్నాయి. రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడో చెప్పి వరుసపెట్టి సినిమాలు ఓకే చేసిన రజినీకాంత్ వ్యవహారం పట్ల మొన్నటివరకూ అభిమానులు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

 

అసలు రజినీకాంత్ రాజకీయ ప్రకటన అంతా బూటకమేనా అన్న డైలమాలో ఫ్యాన్స్ పడిపోయారు. ఇటువంటి తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా సడన్ గా రజినీకాంత్ పార్టీ ప్రకటించడం పట్ల సోషల్ మీడియాలో...అభిమానులు వెరైటీగా స్పందిస్తున్నారు. దేవుడు ముందే కలలోకి వచ్చి ఆజ్ఞ  ఇచ్చి రజనీకాంత్ కి చెప్పి ఉండి ఉంటాడు అంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రజనీ సడన్ సప్రైజ్ పట్ల చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా తలైవా రాజకీయ రంగంలో అడుగుపెట్టారు ఇంకా బాగా కష్టపడాలి మనందరం అంటూ కొంత మంది ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: