మంచు విష్ణు సినీ కెరీర్ లో (2007) లో వచ్చిన ‘ఢీ’ సినిమా చాలా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పాలి. విష్ణు ని కమర్షియల్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఇక శ్రీ‌ను వైట్ల కి ఈ సినిమా సూపర్ హిట్ తో పాటు బోలెడన్ని అనుభవాలని ఇచ్చింది. ఒకానొక సందర్భంలో నిర్మాత మిడిల్ డ్రాపయితే శ్రీ‌ను వైట్ల రిస్క్ చేసి తన సొంత డబ్బు పెట్టి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. అయితే ఆ రిస్క్ శ్రీ‌ను వైట్ల కి మంచి లైఫ్ ఇచ్చింది. ఆయనని మళ్ళీ మళ్ళీ ఆ సినిమా లాంటి సినిమా తీయమని అడిగేవారు చాలామంది ఉన్నారు.

 

ఇక విష్ణుకు కూడా ఢీ సినిమా మంచి లైఫ్ నిచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో తో చేసిన ‘అంద‌రివాడు’ సినిమా త‌ర్వాత రెండేళ్ల పాటు నానా క‌ష్టాలు ప‌డి తీసిన ఈ సినిమాతో తానేమిటో శ్రీ‌ను వైట్ల నిరూపించుకున్నాడు. ఆ సినిమా నుంచే ఓ ప‌దేళ్ల పాటు ఆయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. ఆ సినిమాలోని పంచ్ డైలాగ్స్ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా న‌వ్వించాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్ప‌టికీ ‘రావుగారూ న‌న్ను ఇన్‌వాల్వ్ చెయ్య‌కండి’ అనే బ్ర‌హ్మానందం డైలాగ్ చాలా మంది వాడటం ఆసక్తికరం. ఇక ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత ఆ సినిమాకు సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తూ మంచు విష్ణుతోటే ఆ సీక్వెల్‌ను తియ్య‌డానికి శ్రీ‌ను వైట్ల స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

 

అయితే ఢీ సినిమాలో కొన్ని ముఖ్య పాత్రలున్నాయన్న సంగతి తెలిసిందే. వాటిలో చాలా ప్రత్యేకమైనది సినిమాలో బాగా పాపులర్ అయింది శ్రీ హరి పాత్ర. ఆ తర్వాత బ్రహ్మానందం పోషించిన పాత్ర. అయితే ఆ పాత్రలు చేయడానికి బ్రహ్మానందం ఉన్నప్పటికి శ్రీహరి మాత్రం చనిపోయిన సంగతి తెలిసిందే. మరి ఆయన స్థానంలో ఎవరు నటించిన ఆ స్థాయిలో ఆకట్టుకోలేరు. అసలు శ్రీహరి లేకుండా ఢీ సినిమా సీక్వెల్ ని ఊహించుకోవడం చాలా కష్టం. మరి ఇలాంటి నేపథ్యంలో శ్రీను వైట్ల మంచు విష్ణు ఢీ 2 కి సిద్దమవుతుండటం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: