యాంకర్ వర్షిణి.. గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచడం అవసరం లేదు. ఈ అందాల భామ తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ముద్దు ముద్దు మాటలతో అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. తెలుగు బుల్లితెర పై సాంప్రదాయాన్ని పక్కన పెట్టి.. అందాల ఆరబోతను పరిచయం చేసిన యాంకర్లలో ఈమె కూడా ఒకరు.
వాస్తవానికి ఈమె అసలు పేరు షామిలి సౌందరాజన్. ఈమెది హైదరాబాద్.. ఆమె తల్లితండ్రులు ఎప్పుడో ఇక్కడకు వచ్చి సెటిల్ అయ్యారు. బ్యాచిలర్స్ పూర్తి చేసిన యాంకర్ వర్షిణి ఆ తరువాత మోడలింగ్ మొదలుపెట్టింది. అందంతో పాటు నటించే టాలెంట్ కూడా ఉండటంతో సినిమాల వైపు అడుగులు వేసింది. ‘చందమామ కథలు', ‘బెస్ట్ యాక్టర్స్' పాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది. ‘బెస్ట్ యాక్టర్స్' సినిమా దర్శకుడు అరుణ్ పవార్‌తో శామిలి ప్రేమలో పడింది. 2015లో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ఈ జంట ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లకముందే బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది.
శామిలి సౌందరాజన్‌గా సినీ రంగానికి పరిచయం అయిన ఈ భమ అక్కడ సరైన అవకాశాలు లేక పోవడంతో బుల్లితెర వైపు టర్న్ అయ్యారు. ఈ క్రమంలోనే వర్షిణిగా పేరు మార్చుకున్నారు. ఆ పేరు తనకు కలిసి రాలేదనే ఇలా మార్చుకుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ బ్యూటి తెలుగులో సూపర్ హిట్ డాన్స్ ఫ్రోగ్రామ్ ఢీ-10కు కో-యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో హాట్ హాట్ ఫొటోలు పెట్టి కాక రేపుతోంది. ఇక మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.