ఏం కరోనార బాబు మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తుంది.. దీనివల్ల పిల్లల చదువులు పాడవుతున్నాయి.. అత్యవసరంగా చేయవలసిన ప్రయాణాలు ఆగిపోతున్నాయి.. మొత్తంగా ప్రపంచం అంతా అల్లోకల్లోలంగా మారుతుంది.. ఇక ఈ కరోనాను ఆసరగా చేసుకుని దోచుకునే వాళ్లు దోచుకుంటున్నారు.. మోసాలు చేసే వాళ్లు చేస్తూనే ఉన్నారు.. ప్రస్తుతం అయితే లోకం మొత్తం భయం భయంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నారు..

 

 

ఇక ఈ కరోనా ప్రభావం ఎంతగా ఉందో తెలియదు గానీ ప్రజల్లో మాత్రం  విపరీతమైన భయం క్రియేట్ అయ్యింది.. అంతే కాదు ఈ కరోనా పై రకరకాల ప్రచారాలు కూడా చేస్తున్నారు.. ఇదిలా ఉండగా చాలా మంది సినీ తారలు కూడా ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా పై బిగ్‌బీ కొంచెం వినూత్నంగా స్పందించాడు.

 

 

అదేమంటే తత్వవేత్తలు, ఆశావాదులు, మేధావులు, సృష్టి కర్తలు, జీవిత పాఠాలు బోధించేవారు ఇలా ఎంతో మంది ఎన్నో ఏళ్ల నుంచి ‘ఒకే ప్రపంచం’ అంటూ ఎన్నో రకాల ఉపన్యాసాలు ఇస్తున్నారు. అవి మాటల వరకే కానీ చేతల్లో వాళ్లందరూ విఫలమయ్యారు. ఈ కొవిడ్‌19 మాత్రం ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఏకతాటిపై తెస్తోంది’ అంటూ తన బ్లాగులో రాసుకొచ్చారు. అంతేకాదు అమితాబ్‌ బచ్చన్‌ కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో కూడా తెలిపారు..

 

 

ముఖ్యంగా చేతులు, ముఖం సబ్బుతో కడగడం, షేక్‌ హ్యాండ్ ఇవ్వకుండా, నమస్కారం పెట్టడం, జన సమూహానికి దూరంగా ఉండమంటూ తన స్టాఫ్‌కు సూచనలిస్తున్నట్లు కూడా చెప్పారు.  ఇక భారతదేశానికి వచ్చిన ఈ కరోనాను తరిమేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు ప్రమాదంలో పడటం ఖాయం.. అందుకే కరోనా వచ్చాక భయపడుతూ, బాధపడటం కంటే రాకుండా జాగ్రత్తపడటం నయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: