స్టార్ హీరోల సినిమాలు అనగానే హీరోయిన్లకు ఒక రకంగా పండగ వాతావరణమే. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఎక్కడ అయినా సరే హీరోయిన్లు అగ్ర హీరోలతో సినిమాలు చేయ్యాలనుకుంటారు. అందుకోసం అవసరం అయితే ఒక అడుగు వెనక్కు వేయడానికి కూడా రెడీ అవుతారు. బాలీవుడ్ సంగతి ఏమో గాని మన దగ్గర మాత్రం ఇప్పుడు హీరోయిన్లు స్టార్ హీరోలతో సినిమాలు అనగానే... భారీగా డిమాండ్ చేస్తూ మేము తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అగ్ర హీరోలతో సినిమా అనగానే మాకు ఇంత ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేయడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. 

 

పూజ హెగ్డే, రష్మిక మందన వంటి వాళ్ళు భారీగా డిమాండ్ చేస్తున్నారు. అఖిల్ సినిమాకు ఏమో గాని ప్రభాస్ సినిమాకు మాత్రం పూజ భారీగా డిమాండ్ చేసింది. దీనితో నిర్మాతలు ఇప్పుడు ఆమె విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఫుల్ స్వింగ్ లో ఉంది. పట్టిన ప్రతీ ఒక్కటి బంగారమే అవుతుంది. దీనితో భారీగా డిమాండ్ చేయడం మొదలుపెట్టింది పూజ. ఇక సీనియర్ గా ఉన్న ఉన్న కాజల్ కూడా ఇప్పుడు ఇదే బాటలో నడుస్తుంది. కాజల్ భారీగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి సినిమాకు ఆమె నాలుగు కోట్లకు పైగా అడిగినట్టు తెలుస్తుంది. 

 

అదే విధంగా మరొకరి సినిమా కోసం ఆమెను అడిగితే ఎక్కువగానే డిమాండ్ చేసింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అసలే సీనియర్ హీరోయిన్. ఆమెకు ఇప్పుడు క్రేజ్ తగ్గుతుంది. అయినా సరే అంత డిమాండ్ చేయడం ఏంటీ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తో సినిమా అంటే లక్ ఉండాలని, ఆ లక్ వచ్చినా సరే ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు హీరోయిన్లు ఈ విధంగా డిమాండ్ చేయడం మాత్రం నిజంగా దారుణమని నిర్మాతలు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: