పిల్ల నుంచి తల్లి అయితే అది ప్రమోషన్. కానీ  తల్లి నుంచి పిల్లకు రావడం అంటే చాలా కష్టం. అప్పటికే ఆంటీ అయిపోతారు. ఇది విచిత్రమైన సీమలో జరిగే వ్యవహరమే. అందం చందం అన్నీ ఉండి కూడా  ఎందుకో తల్లీ అనిపించుకుంటోందిట. నిండా పాతిక  ఏళ్ళు లేని ఆ అమ్మడు ఇదేం బాధ అని మధనపడుతోందిట.

 

 

ఆమె ఎవరో కాదు, తెలుగులో అనేక సినిమాల్లో హీరోగా వేసి నాటి యూత్ ని ఆకట్టుకున్న రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు లేటెస్ట్ గా నటించిన వరల్డ్ ఫ్యామస్ లవర్ మూవీ భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీలో పిల్లాడి తల్లిగా  ఐశ్వర్య నటించిందట. సినిమా పోయింది.
చాన్సులూ రావడంలేదని తెగ ఫీల్ అవుతోంది.

 

ఇక కేవలం 20 ఏళ్ళ వయసులోనే తమిళంలో ఒక మూవీ చేసింది ఐశర్య. ఆ మూవీ కూడా ఇద్దరు పిల్లల తల్లి పాత్రే. ఆ తరువాత పెర్ఫార్మెన్స్ అంటూ ఐశ్వర్య చేసిన ప్రయోగాలు ఆమెకు పేరు ఎంత వరకూ తెచ్చాయో కానీ సినిమాలు మాత్రలు పెద్దగా లేకుండా చేశాయి.

 

అయినా వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటే ఈ తిప్పలు తప్పుతాయి కదా. ఏదో నటన అనుకుంటూ మోజు పడితే ఇపుడు ఇలాగే ఉంటుంది. ఒక వయసు వచ్చాక గ్లామర్ షో కి ఎటూ చాన్స్  ఉండదు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.

 

 

 

ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు కావాలని కోరుకుంటోంది. తన అందాన్ని ఆరబోస్తానని  కూడా మాట ఇస్తోంది. కానీ తెలుగులో పెద్ద హీరోలు ఎవరూ పలకడంలేదుట. ఆమెకు ఇపుడు కోలీవుడ్లో కూడా పెర్ఫార్మెన్స్ రోల్స్ మాత్రమే వస్తున్నాయిట. దాంతో ఆమె ఏం చేయాలో తెలియక బోరుమంటోంది. అంతే ముందే చెప్పుకున్నట్లుగా ఇది చిత్ర సీమ. అందుకే ఇలాగే అవుతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: