విశాల్.. దర్శకుడు మిస్కన్ మధ్య వివాదం ముదురుతోంది. దర్శకుడు బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టడంతో వివాదం మొదలైంది. ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు తప్పుకుంటే.. విశాల్ మెగా ఫోన్ పట్టాడు. విశాల్ బహిరంగ లేఖపై.. మిస్కన్ స్పందించి.. నీకు కష్టాలు మొదలయ్యాయి అంటూ విశాల్ పై ధ్వజమెత్తాడు. 

 

విశాల్ నటించిన తప్పరివాలన్ తెలుగులో డిటెక్టివ్ పేరుతో తెలుగులో అనువాదమై.. ఇక్కడ కూడా విజయం సాధించింది. దీంతో దీనికి సీక్వెల్ తప్పరివాలన్ 2 ప్లాన్ చేశారు. తప్పరివాలన్ 2 ఫారిన్ షెడ్యూల్ షూటింగ్ ఐటమ్ లో దర్శకుడు అనవసరంగా ఖర్చు చేయించాడన్నది విశాల్ ఆరోపణ. రోజుకు 15 లక్షలు నష్టం వచ్చిందని.. ముందస్తు ప్రణాళిక లేకుండా.. షూటింగ్ స్పాట్ లోకి ఎలా వస్తారంటూ మిస్కన్ పై మండిపడ్డాడు. తప్పరివాలన్ 2 ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా బహిరంగ లేఖ రాస్తూ.. మిస్కన్ పై వివాదంపై వివరణ ఇచ్చాడు విశాల్. 

 

వివాదాల కారణంగా.. మిస్కన్ సినిమాను నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతను విశాల్ తన భుజానికి ఎత్తుకున్నాడు. విశాల్ తనపై చేసిన ఆరోపణలకు మిస్కన్ సమాధానమిచ్చాడు. విశాల్ ని తాను సొంతం సోదరుడిగా భావించానని, కానీ ఆయన మాత్రం తన తల్లిని దూషించాడని మిస్కన్ తెలిపారు. డిటెక్టివ్ ను డైరెక్ట్ చేసినందుకు నాకు మూడు కోట్లు ఇచ్చాడు. కోహినూర్ డైమండ్ దొంగతనం బ్యాక్ డ్రాప్ తో చెప్పిన డిటెక్టివ్ 2కథ విశాల్ కు నచ్చింది. సొంత బ్యానర్ లోనే తెరకెక్కిస్తానని విశాల్ చెప్పాడు. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి వేరే నిర్మాతను చూద్దామని చెప్పినా.. విశాల్ వినలేదన్నాడు మిస్కన్. 

 

విశాల్ చేసిన ఆరోపణలను మిస్కన్ తిప్పికొట్టాడు. ఇష్యూపై మాట్లాడుతూ.. డిటెక్టివ్ 2 బడ్జెట్ విషయంలో నాకు విశాల్ కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. విశాల్ నాకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో నేను ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను. విశాల్ ను సోదరుడిగా భావించాను. కానీ వివాదాలు జరుగుతోన్న టైమ్ లో విశాల్ ఓ రోజు మా అమ్మని సైతం అసభ్య పదజాలంతో దూషించాడు. నా సోదరుడిని కొట్టాడని ఆరోపించాడు మిస్కన్. విశాల్ కు కష్టాలు మొదలయ్యాయని.. ప్రశాంతంగా నిద్రకూడా పోలేడని ఘాటుగా స్పందించాడు దర్శకుడు. డిటెక్టివ్ 2 రిలీజ్ అయ్యే లోపు.. ఇంకెన్ని వివాదాలు బయటికొస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: