టాలీవుడ్ లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాతో బాగా గుర్తింపు పొందినప్పటికి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోయిన్ గా నటించిన మగధీర సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా కాజల్ కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్ళింది. ఆ తర్వా ఎన్నో క్రేజీ సినిమాలలో నటించింది. ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలందరి తోను నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకుంది.

 

అంతేకాదు కోలీవుడ్ లో కూడా సూర్య, కార్తి, ధనుష్, విజయ్ వంటి స్టార్స్ తో నటించి కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. అంతేకాదు అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కూడా ఇప్పటికీ తన స్థానం పదిలంగా ఉంచుకోగలిగిందంటే తన సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కాజల్ అగర్వాల్ దర్శకుల హీరోయిన్ అన్న మంచి పేరుని సంపాదించుకుంది. ఏ సినిమాకి ఇంత రెమ్యూనేఅషన్ కావాలని డిమాండ్ చేయదన్న పేరు సంపాదించుకుందంటే తనకి రెమ్యూనరేషన్ కంటే సినిమా ఇంపార్టెంట్ అన్న విషయం అర్థం చేసుకోవచ్చు.

 

ఇదంతా ఒక ఎత్తైతే కాజల్ పెళ్ళి విషయం మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే ఈ విషయంలో తన ఇంట్లోనే పోటీ ఉంది. కాజల్ అగర్వాల్ కి చెల్లెలున్న సంగతి తెలిసిందే. నిషా అగర్వాల్ కాజల్ మాదిరిగా హీరోయిన్ గా టాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించింది. వాటిలో ఒకటి రెండు సినిమాలు మంచి పేరుని తీసుకు వచ్చాయి. అయితే కాజల్ లాగా స్టార్ హీరోయిన్ అయి ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. దాంతో పెళ్ళి చేసుకొని సెటిలయిపోయింది. అప్పటీ నుంచి కాజల్ కూడా పెళ్ళి చేసుకోబోతుందన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అందులో ముఖ్యంగా టాలీవుడ్ బడా నిర్మాత కొడుకు హీరో రానా దగ్గుబాటి ని కాజల్ ప్రేమించిందని ఇద్దరు పెళ్ళి చేసుకుంటున్నారన్న వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. అయితే అందుకు కారణం రానా అని చెప్పాలి. 

 

ఆయన హోస్ట్ చేస్తున్న ఒక షోలో నవదీప్ కాజల్ గెస్ట్ లు గా వస్తే వాళ్ళకి రానా చిన్న గేం ఆడించాడు. ఇందులో భాగంగా కాజల్ కి నవదీప్ అన్న అని కాజల్ ని పెళ్ళి చేసుకోవడానికి నన్ను ఒప్పించమని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇదే టాస్క్ చూసిన ప్రేక్షకులు నిజంగా రానా కి కాజల్ అగర్వాల్ కి పెళ్ళి ఫిక్సయ్యారు. అదే ఇప్పుడు హాట్ న్యూస్ గా వైరల్ అవుతోంది. ఇక కాజల్ రానా కలిసి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సస్ ని అందుకుంది.  
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: