రీసెంట్ గా మెగా మేనళ్లుడు సాయి తేజ్ ఒక సినిమాకు ముహూర్తం పెట్టుకున్నాడు. దేవా కట్టా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మెగా హీరోకి జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తుంది. ఇద్దరు ఇప్పటికే చిత్రలహరి సినిమాకు కలిసి పనిచేశారు. అయితే ఆ సినిమాలో నివేదా సెకండ్ లీడ్ గా చేసింది. దేవా కట్టా సినిమాలో మాత్రం నివేదా సోలో హీరోయిన్ గా చేస్తుంది. నివేదా పేతురాజ్ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. 

 

ఇక ఇదిలాఉంటే ఈ సినిమా ఓపెనింగ్ కు పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే ఇక్కడ మరి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దేవా కట్టా ఈ సినిమాను పవర్ స్టార్ కోసం రాసుకున్నాడట. పవన్ తో చేయడం కష్టమని తెలుసుకున్న దేవా కట్టా సాయి తేజ్ తో ఈ మూవీ చేస్తున్నాడు.

 

చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. సుబ్బు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. పవన్ సినిమా కథతో రాబోతున్న సాయి తేజ్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్థానం సినిమా తీసిన దేవా కట్టా టాలెంట్ ఉన్నా అందుకు తగినట్టు సినిమాలు చేయలేకపోయాడు. మరి సాయి తేజ్ సినిమాతో దేవా కట్టా కూడా ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. సినిమా కథ కథనాలు దేవా మార్క్ కనిపించేలా ఉంటాయట. పవన్ స్టోరీ తో సినిమా చేస్తున్న సాయి తేజ్ ఈ సినిమాతో కెరియర్ బెస్ట్ హిట్ అందుకోవాలని అంటున్నారు మెగా ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: