మన్మధుడు... ఈ పధం వినపడగానే చాలా మందికి గుర్తుకి వచ్చే హీరో నాగార్జున అక్కినేని. కెరీర్ మొదట్లో అంతగా గ్లామర్ తో ఆకట్టుకోకపోయినా తర్వాతి సినిమాలతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసే సినిమాలు అన్నీ కూడా ఆ తర్వాత అమ్మాయిలకు బాగా దగ్గరయ్యాయి. ముఖ్యంగా సంతోషం, మన్మధుడు సినిమాలు అన్నీ కూడా అమ్మాయిలకు దగ్గరైనవే. అప్పటి తరం అమ్మాయిలకు అతను డ్రీం బాయ్ గా మారిపోయాడు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధ౦ లేకుండా ఆయన ఒక ఊపు ఊపారు టాలీవుడ్ లో. 

 

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు అమ్మాయిలకు దగ్గరయ్యాయి. అయితే కెరీర్ లో ఆయన గత పదేళ్ళ నుంచి సరైన సినిమా అనేది చేయలేకపోయారు అనేది వాస్తవం. ప్రస్తుతం ఆయన సినిమా అంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆయనకు సినిమాలు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి అనేది వాస్తవం. సంతోషం సినిమాలో కూడా ఆయన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఇక ఆయన చేసే సినిమాల్లో దాదాపుగా ప్రేమ కథలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాల్లో ఆయన హీరోయిన్లను తన వైపుకి తిప్పుకున్నారు కూడా. 

 

ముఖ్యంగా ఆయన టబు, శ్రేయ వంటి, సోనాలి బింద్రే వంటి హీరోలతో చేసిన సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి అప్పట్లో. ఇప్పుడు ఆయన పెద్దగా అలాంటి సినిమాలు చేయడం లేదు. ఎప్పుడో ఒక సినిమాతో పలకరిస్తున్నారు గాని, పెద్దగా ఆ సినిమాలు కూడా ఆకట్టుకోవడం లేదు. పూర్తిగా ఆయన సినిమాల నుంచి దాదాపుగా దూరమయ్యారు. ఇక ఆయన కుమారులే సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అంటున్నారు టాలీవుడ్ జనం. ఏది ఎలా ఉన్నా సరే ఈ తరం అయినా ముందు తరం అయినా సరే నాగ్ మాత్రం అమ్మాయిలకు మన్మధుడే.

మరింత సమాచారం తెలుసుకోండి: