తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి తరం నుంచి నేటి తరం వరకూ ఎంతో మంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు. ఎంతో మంది తెలుగు చిత్ర పరిశ్రమలో తమ  ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు. భారీ రేంజ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చురుగొన్నారు. ఇక నేటి తరంలో అయితే హీరోలకు  కొదవ లేదు అని చెప్పాలి. దీంతో అటు ప్రేక్షకులకు కూడా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం సరికొత్త స్టైల్ తో హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇప్పటి హీరోలు ఎంత మంచి స్టైల్ లో ప్రేక్షకులను అలరించిన... లవర్ బాయ్ గా మారాలి అనుకున్న... ఒకప్పటి హీరోని మాత్రం ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. ఆ హీరో ఎవరు అంటే తన అందంతో ఎంతోమంది మగువల మనసులను కొల్లగొట్టిన శోభన్ బాబు. 

 

 

 అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎవర్గ్రీన్ లవర్ బాయ్ గా  దూసుకుపోయాడు శోభన్ బాబు. తన అందంతో ఏకంగా సినీ ప్రేక్షకులను మాత్రమే కాదు... హీరోయిన్ల మనుసులను కూడా కొల్లగొట్టాడు. ముఖ్యంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అప్పట్లో సినిమాల్లో ఉన్న సమయంలో శోభన్ బాబు జయలలిత మధ్య మంచి అనుబంధం ఉండేది అని చెబుతుంటారు. అంతేకాకుండా చాలా మంది హీరోయిన్లు కూడా శోభన్ బాబు అంటే తెగ ఇష్టపడే వారు. అందుకే శోభన్ బాబు  కాస్త తెలుగు చిత్ర పరిశ్రమకు సోగ్గాడు గా మారిపోయాడు. తనదైన అందంతో ఎంతోమంది మగువల మనసులను కొల్లగొట్టి... ఎంతో మంది హీరోయిన ల  మనసులు దోచేశాడు. ఇక ఆనాటి లవర్ బాయ్ గా కొనసాగిన శోభన్ బాబు  ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమకు సోగ్గాడే. 

 

 

 ఇప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కొత్త హీరోలు వచ్చినప్పటికీ... సిక్స్ ప్యాక్ లు చేసి మరి అభిమానులను అలరిస్తున్నప్పటికీ... నాటితరం లవర్ బాయ్ సోగ్గాడు శోభన్ బాబు అందాన్ని మాత్రం ఎవరూ బీట్  చేయలేరు అని చెప్పాలి. శోభన్ బాబు సినిమా లో ఒక్కసారి కనిపిస్తే చాలు మగువలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోయేవాళ్లు . ఇక సోగ్గాడి గానే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు శోభన్ బాబు. అందుకే అసలు సిసలైన లవర్ బాయ్ శోభన్ బాబు  అంటుంటారు చాలామంది.

మరింత సమాచారం తెలుసుకోండి: