తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు మూడు దశాబ్దాల క్రితం టాలీవుడ్లో శోభన్ బాబు  ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ శోభన్ బాబు మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అదిరిపోయే అందం తో టాలీవుడ్ ఎవర్ గ్రీన్ అందగాడు గా మారిపోయాడు శోభన్ బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకోవడమే కాదు... తన అందంతో ఎంతోమంది మగువల మనసులను కూడా కొల్లగొట్టాడు శోభన్ బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో వన్ అండ్ ఓన్లీ  అందగాడు అన్నట్లుగా ఓ వెలుగు వెలిగాడు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు సోగ్గాడు గా మారిపోయాడు శోభన్ బాబు. అప్పట్లో శోభన్ బాబు ను లవర్ బాయ్ అని పిలిచేవారు. 

 

 

 ఎందుకంటే మహిళ ప్రేక్షకుల్లో శోభన్ బాబుకు  ఉండే క్రేజ్ అలాంటిది మరి. శోభన్ బాబు సోగ్గాడు గా పేరు తెచ్చుకోవడానికి... మహిళా అభిమానులను ఆకర్షించింది లవర్ బాయ్ గా  మారిపోవడానికి ఆ ఒక్కటే కారణం అంటూ చెబుతూ ఉంటారు. అదే ఆయన హెయిర్ స్టైల్ . శోభన్ బాబు ఎన్ని సినిమాలు తీసినా.. ఆయన హెయిర్ స్టైల్ మాత్రం ఒకేలా ఉంటుంది. ముఖ్యంగా శోభన్ బాబు అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ముందుగా ముఖం మీదికి వాలిపోతున్న ఒక రింగు లాంటి వెంట్రుకలు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు కు తప్ప ఎవరికీ ఉండవు. దీంతో ఇది మరింతగా ప్రేక్షకులను ఆకర్షించింది. 

 

 

 ఇలా అదిరిపోయే ముఖ సౌందర్యంతో... ఆకర్షించే హెయిర్ స్టైల్ తో... నాటి తరం అమ్మాయిల అందరికీ లవర్ బాయ్ గా మారిపోయాడు శోభన్ బాబు. తెలుగు చిత్ర పరిశ్రమకు సోగ్గాడు గా మారిపోయాడు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకే కాదు... ఎంతో మంది హీరోయిన్ల మనసులును కూడా కొల్లగొట్టాడు సోగ్గాడు శోభన్ బాబు. శోభన్ బాబును నాటి తరం హీరోయిన్లు తెగ  ఇష్టపడేవారు. శోభన్ బాబు తో సినిమాలు చేయడానికి బాగా ముందుకు వచ్చే వాళ్ళు. ముఖ్యంగా నాటి తరం హీరోయిన్ల అందరితో శోభన్ బాబు అనుబంధం ఇప్పటికీ అప్పుడప్పుడు ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ టాలీవుడ్ సోగ్గాడు ఎవరు అంటే శోభన్ బాబు అని అంటారు సినీ ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: