అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ ఇమేజ్ యూత్‌లో ఓ రేంజ్‌లో ఉండేద‌ని చెప్పాలి. త‌న‌కున్నంత క్రేజ్ మ‌రే హీరోకి లేదు. అమాంతం ఉన్న‌ట్టుండి యూత్‌లో త‌న క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ హీరోని అంద‌రూ అప్ప‌ట్లో ల‌వ‌ర్‌బాయ్ అనేవాళ్ళు దాని కోసం చాలా మంది హీరోలు ట్రై చేశారు కాని ఎవ్వ‌రికి ఆ ఇమేజ్ మాత్రం వ‌ర్క్ అవుట్ కాలేద‌నే చెప్పాలి. అప్ప‌ట్లో కాలేజ్ గ‌ర్ల్స్ ఉయ‌ర్‌కిర‌ణ్‌కి ఫుల్ ఫిదా అని చెప్పాలి. చిత్రం  సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో. రీమాసేన్ జంట‌గా న‌టించిన ఆ చిత్రం తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. అప్ప‌ట్లో ఫుల్ బోల్ట్ కంటెంట్‌తో ఆ చిత్రాన్ని రూపొందించారు.

 

ఆ త‌ర్వాత హీరోయిన్ అనిత‌తో క‌లిసి నువ్వులేక నేను లేను అనే ఓ ప్రేమ క‌థ‌లో చేశారు. అది కూడా అప్ప‌ట్లో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింద‌నే చెప్పాలి. మ‌న‌సంతా నువ్వే అంటూ ఓ రొమాంటిక్ చిత్రంలో రీమాసేన్‌తో క‌లిసి ఆయ‌న న‌టించిన న‌ట‌న అద్భుత‌మని చెప్పాలి. ఇలా ఉద‌య్ కిర‌ణ్ చేసిన చిత్రాల‌న్నీ దాదాపుగా ప్రేమ‌క‌థా చిత్రాలు కావ‌డంతో ఆయ‌న‌కు ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ చాలానే ఉండేది. ఇక రీమాసేన్‌తో ఆయ‌న న‌టించిన రెండు చిత్రాలు హిట్టే. ఒకానొక స‌మయంలో ఆయ‌న‌కున్న క్రేజ్ చూసి టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి కుమార్తెను త‌న‌కిచ్చి వివాహం చేద్దామ‌నుకున్నారు. కానీ ఏవో చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల్ల ఆ వివాహం ర‌ద్ద‌యింది.

 

ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా ఉద‌య్‌కిర‌ణ్‌కి అవ‌కాశాలు రావ‌డం కూడా త‌గ్గిపోయాయి. అనుకోని ప‌రిస్థితుల్లో త‌ను స‌డెన్‌గా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. అవ‌కాశాలు దొర‌క‌క కొంత డిప్ర‌ష‌న్‌కి ఫీల‌య్యార‌ని అంద‌రూ అంటుంటారు. ఇక ఇంత క్రేజ్ ఉన్న హీరో అదే క్రేజ్ గ‌నుక కొన‌సాగి ఉండుంటే ఇప్ప‌టికీ ఉద‌య్ ఫుల్ ఫామ్‌లోనే ఉండేవార‌ని చెప్పాలి. ఎందుకంటే ఉద‌య్‌కి ఆ టైమ్‌లో అంత రెస్పాన్స్ వ‌చ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: