తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ హిట్ కాంబినేషన్ అంటే అందరూ ముక్త కంఠంతో చెప్పేది కే రాఘేంద్రరావు చిరంజీవి అనే అంటారు. వీరిద్దరూ కలసి 14 సినిమాలు చేసారు అంటేనే అర్దం చేసుకోవచ్చు వీరిది మంచి కాంబినేషన్ అని. ప్రేక్షకులలో కూడా మంచి ఆదరణ లభించింది వీరి సినిమాలకు. సినీ పరిశ్రమ లో ఇన్నేళ్ళు ఈ కాంబినేషన్ ఇంకా కొనసాగుతుంది అంటే వీరికి ఉన్న అండర్స్టాండింగ్ అలాంటిది. మొదటి చిత్రం దగ్గర నుంచి మొన్నటి వరకూ చేసిన మంజునాథ సినిమా వరకూ దర్శకేంద్రుడు మెగా స్టార్ ను అన్ని కోణాల్లోను ప్రేక్షకులకు కావల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందించారు.

 

ఘరానా మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, శ్రీ మంజునాథ, కొండవీటి రాజా, అడవి దొంగ, రౌడి అల్లుడు, ఇద్దరు మిత్రులు, ముగ్గురు మొనగాళ్ళు, తిరుగులేని మనిషి, మంచి దొంగ, చాణక్య శపథం, యుద్ద భూమి, మోసగాడు, రుద్రనేత్ర సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 14 సినిమాల్లో చిరంజీవి రాఘవేంద్ర రావు కలిసి పని చేయగా... 12 సినిమాల్లో చిరంజీవి సింగిల్ హీరోగా నటించారు. ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తో పాటుగా చిరంజీవి ఇమేజ్ ని భారీగా పెంచాయి. 

 

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చిరంజీవి ఇమేజ్ ని మరో కోణం లో పెంచింది. ముగ్గురు మొనగాళ్ళు సినిమా ద్వారా చిరంజీవి మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. అలాగే ఘరానా మొగుడు సినిమా ద్వారా మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఇద్దరు మిత్రులు, తిరుగులేని సినిమా లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు అన్నీ కూడా అప్పట్లోనే మంచి వసూళ్లు సాధించడమే కాకుండా 100 రోజులు ఆడాయి. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది త్వరలో అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: