మాస్ మహారాజాతో నటిస్తే చాలు ఆ హీరోయిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోతదని చెప్పాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వరుస ఫ్లాప్‌లతో రవితేజ కాస్త డల్ అయ్యారని చెప్పాలి. దీంతో ఆయనతో నటించడానికి హారోయిన్లు అంతగా ముందుకు రావడం లేదట. ఎందుకంటే ఆయన పక్కన నటిస్తే వాళ్ళ పాత్రలకు మాత్రం పెద్దగా ఎలివేట్ కావడం లేదట.
సో, రవితేజతో జోడీ కట్టనున్న ఇస్మార్ట్ భామ నిధి అయినా ఈ పరిస్థితిని బ్రేక్ చేస్తుందేమో చూడాలి. రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. తదుపరి ప్రాజెక్టునూ ఇప్పటికే లైన్లో పెట్టాడు. గతేడాది ‘రాక్షసుడు’ రీమేక్‌తో మంచి హిట్టుకొట్టిన రమేష్ వర్మ ఈసారి తమిళ హిట్టు ‘శతురంగ వెట్టై’ని రవితేజతో రీమేక్ చేయనున్నాడు.
రవితేజ -రమేష్‌వర్మ కాండినేషన్‌లో రానున్న ప్రాజెక్టుకు హీరోయిన్గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో రవితేజకు జోడీగా ఛాన్స్ కొట్టేసిన ఈ హీరోయిన్ రొట్టెవిరిగి నేతిలో పడినట్టే అన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారింది. రవితేజకే సరైన హిట్టులేని పరిస్థితుల్లో.. జోడీగా నటించిన హీరోయిన్లకూ గొప్ప బ్రేక్ రావడం లేదు.
అందులో నిధి అగర్వాల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా నడుస్తోంది. ఆమె కెరీర్ కూడా అంత స్పీడ్‌గా లేదు. ఇస్మార్ట్.. తరువాత వరుస చాన్స్‌లు రావొచ్చని అనుకున్న ఈ భామ అలాంటి సీన్ కనిపించలేదు. సీనియర్ హీరో రవితేజకు జోడీగా ఛాన్స్ రావడంతో -ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట కుర్ర బ్యూటీ. అయితే, ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ అనిపించుకుంటుందా? అన్న చర్చ మొదలైంది ఇండస్ట్రీలో.
రమేష్‌వర్మ చేస్తున్న రీమేక్ కనుక వర్క్ అవుట్ అయితే రవితేజతోపాటు నిధి కెరీర్‌కూ మేలు జరగడం ఖాయం అంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇస్మార్ట్ భామకు బ్రేక్ అనేది పగటికలే అంటున్నారు. ఎందుకంటే ఆమె ఇస్మార్ట్ శంకర్‌లో చాలా ఎక్స్పోజ్ చేసింది. అంత అందాలను చూపించినప్పటికి ఆమెకు అవకాశాలు మాత్రం వరించడంలేదు.