ఈ మద్య దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరోనా వైరస్.  ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ భారిన పడి బెంబేలెత్తిపోతున్నాయి.  చైనా తర్వాత అత్యంత ప్రభావితమైన దేశం ఇటలీ, ఫ్రాన్స్.  ఇక్కడ ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు సంబవించాయి.  ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షల మంది ఈ కరోనా మహమ్మారి భారిన పడ్డట్టు అంచనా.  ఈ కరోనా ఇప్పుడు మనదేశంలో మెల్లిమెల్లిగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే అనుకుంటే నిన్న లోకల్ గా కూడా కరోనా వైరస్ కేసు ఒకటి నమోదు అయ్యింది. అంటే దీని ప్రభావం ఇప్పుడు లోకల్ లో మొదలైనట్టే లెక్క. 

 

ఈ సమయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఇక కరోనా వైరస్ ని ఎదిరించాల్సిందే.. దీనికి యాంటీడోస్ లేదు.. అందుకే మనందరం పరిశుభ్రతను పాటించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటూ సినీ, రాజకీయ, క్రీడారంగానికి చెందిన వారు చెబుతూనే ఉన్నారు. నేడు దేశ వ్యాప్తంగా జనతా కర్ప్యూని విధిగా పాటించాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలందరూ.. తమ ఇళ్ల వద్దనే ఉండాలని.. అన్ని పనులను వాయిదా వేసి కర్ఫ్యూకి సంఘీభావం ప్రకటించాలని విక్టరీ వెంకటేష్   ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశారు.

 

భారతదేశంలో కరోనా వైరస్ రెండవ దశలో ఉంది. అంటే విదేశాల నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి రోగగ్రస్తం అయిన వ్యక్తులు వచ్చే వస్తే తప్ప వారి నుంచి వైరస్ సంక్రమించడం జరగడం లేదు. వైరస్ ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉన్నట్లు మూడు నాలుగు దశలోకి విస్తరించింది. ఇదే ఇప్పుడు కీలకమైన పరిస్థితి.. ఇప్పుడు మనందరం జాగ్రత్తలు పాటిస్తే.. కరోనాని కొంతలో కొంత రూపుమాపొచ్చు అన్నారు. కాబట్టి ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత... సామాజికంగా దూరం పాటించాలనీ… రేపు జనతా కర్ఫ్యూ లో అందరూ పాల్గొనాలని వెంకటేష్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: