టాలీవుడ్ క్రేజీ యాక్టర్ నాని వ‌రుస మూవీల‌ను రిలీజ్ చేసుకుంటూ ఫిబ్రవరి నెల అంతా టాలీవుడ్ బాక్సాపీస్‌కు పండుగ వాతావ‌ర‌ణాన్నిక్రియోట్ చేస్తున్నాడు. ఫిబ్రవ‌రి 7న పైసా, 14న జెండాపై క‌పిరాజు, 21న ఆహా క‌ళ్యాణం ఇలా వ‌రుస మూవీల‌తో ప్రతి వారం ఓ రిలీజ్‌ను, వారం అంతా నాని మూవీల టాపిక్స్‌తో టాలీవుడ్ టైం గ‌డిచిపోతుంది. ఇదిలా ఉంటే నాని న‌టించిన ఆహా క‌ళ్యాణం మూవీలోని హీరోయిన్ వాణిక‌పూర్ మ‌రో సారి నానిపై నోరు జారింది. దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స్టోరిను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. ఆహా క‌ళ్యాణం మూవీ ప్రమోష‌న్‌లో భాగంగా వాణి క‌పూర్‌, హైద‌రాబాద్‌లోని ఓ రేడియో స్టేష‌న్‌కు వ‌చ్చారు. ఇందులో ఓ కాల‌ర్ అడిగిన ప్రశ్నకు వాణిక‌పూర్ చెప్పిన సమాధానం అంద‌రిన్ని అశ్ఛర్యప‌రిచింది. వాణిక‌పూర్ అంటున్నది నిజ‌మేనా అనేలా అంద‌రూ ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. ఇంత‌లోనే మాట మార్చి జోక్ చేశాలే అంటూ లైట్ తీసుకోండి అంది. ఇంత‌కీ వాణిక‌పూర్‌ను కాల‌ర్ అడిగిన క్వశ్ఛన్ ఏంటంటే 'మీకు నానితో ఎఫైర్ ఉందంటున్నారు. నిజ‌మేనా?' అని అడింగింది. కాల‌ర్ ప్రశ్నకు వాణిక‌పూర్ ఏ మాత్రం ఆలోచించ‌కుండా 'ఇది చాలా కామ‌న్ క‌దా. ఎందుకు ఇలా జ‌ర‌గ‌కూడ‌దు. నాని చాలా కూల్ అండ్ హాట్ ఫ్రెండ్' అని అనేసింది. దీంతో ఎఫ్‌.యం స్టూడియోలోని అంద‌రూ వాణిక‌పూర్‌ను అలాగే చూస్తుండిపోయారు. ఇది గ‌మ‌నించిన వాణి 'జోక్ చేశాను, లైట్ తీసుకోవండి' అనేసరికి అంద‌రూ ప‌క‌ప‌కా న‌వ్వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: