ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం అంతటా అలుముకుంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం భూమ్మీద వందకు పైగానే దేశాలలో వ్యాపించింది. ఇటువంటి నేపథ్యంలో చాలా దేశాలు షట్ డౌన్ అయిపోయాయి. యూరప్ దేశాలు అయితే గజగజ లాడుతున్నయి. భూమి మీద సూపర్ పవర్ కంట్రీ ఇన్ అమెరికా...తమ దేశానికి ఇతర దేశస్తులు ఎవరు రావద్దని, ముఖ్యంగా యూరప్ దేశాలకు చెందిన వారు రావద్దు అని ఆంక్షలు విధించడం జరిగింది. ఇదే తరుణంలో ఇండియాలో కూడా ఇతర దేశానికి సంబంధించిన విమాన రాకపోకలు ఆపేశారు. దేశంలో కూడా లోకల్ ట్రాన్స్ పోర్ట్ ని ఆపి వేయడం జరిగింది. మార్చి 22 నుండి 31 వరకు ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరు పాటించాలని, పిలుపు ఇవ్వటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో దేశంలోని దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 

అదేమిటంటే కరోనా వైరస్ వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఈ నేపథ్యంలో ప్రీమియం చెల్లింపులకు సంబంధించి గడువును పొడిగించినట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. దీంతో ఎల్ఐసి పాలసీదారుల వారి పాలసీ ప్రీమియం మొత్తాన్ని ఏప్రిల్ 15లోగా చెల్లిస్తే సరిపోతుందని ఎల్ఐసి తెలిపింది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎల్‌ఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

దేశ వ్యాప్తంగా 80 పట్టణాల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో...దేశ ఆర్థిక పరిస్థితి, వ్యవస్థ మొత్తం తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడబోతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. భారతదేశంలో కూడా రోజురోజుకీ ఈ వైరస్ ప్రభావం పెరుగుతూ వస్తుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: