దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ.  గత వారం రోజులుగా కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు.. 500 కేసులు నమోదు అయ్యాయి.. ప్రతిక్షణం కరోనా భయంతో మనిషి వణికిపోతున్నారు.    సినీ సెలబ్రెటీలు తమకు సాధ్యమైనంత వరకు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు.

 

ఆదివారం ప్రధాని సూచన మేరకు జనతా కర్ఫ్యూ కూడా పాటించాం.   ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న విషయం తెలిసిందే.  అలాంటి వారిపై కఠినంగా ఉండే పరిస్థితి పోలీసులకు ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులకు తన వంతు కృషితా కొన్ని టిప్స్ ఇస్తున్నారు.  

 

నేడు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ సినీనటుడు మహేశ్‌ బాబు ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఉండాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పాడు. 'ఈ అనుకోని పరిస్థితుల్లో ఈ ఆరు గోల్డెన్ రూల్స్ పాటించాలని నేను కోరుతున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు పాటించాలి' అని చెప్పాడు.

 

-  మొదటిది, చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట అడుగుపెట్టాలి.
 
-  20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు సబ్బు, నీళ్లతో మీ చేతులు కడుక్కోండి.

-  మీ ముఖాన్ని తాకకండి. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకండి.

- దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ మోచేతులను లేక టిష్యూను అడ్డుగా పెట్టుకోండి.  

-  సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకోండి. ఇంట్లో, బయట ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరం ఉండండి.

-  మీకు కరోనా లక్షణాలు లేక అనారోగ్యం ఉంటే మాత్రమే మాస్క్ ని వాడండి. మీకు కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని సంప్రదించండి.


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: