కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. చైనాలో పుట్టినట్లుగా చెప్పుకుంటున్న ఈ వైరస్ ప్రపంచానికంతటా విస్తరించి తన విషపు కోరలతో మానవాళి మీద కాటేస్తుంది. ఇంకా వ్యాక్సిన్ కనుగొనబడని ఈ వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. వైరస్ ప్రభావం లేని ప్రాంతం ప్రపంచంలో ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో. ఏదో ఒక రూపంలో దీని ప్రభావం మనుషుల మీద తీవ్రంగా పడింది.

 

 

ఆర్థికంగా బాగా చితికిపోయాం. కోట్లకి కోట్ల డబ్బు వైరస్ ని మట్టుపెట్టడానికే వెచ్చిస్తున్నాం. అన్ని పరిశ్రమన్లు దెబ్బతిన్నాయి. ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. సప్లై లేదు. డిమాండ్ లేదు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ అయిన వాటిలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. థియేటర్లు మూతబడ్డాయి, షూటింగ్ లు ఆగిపోయాయి. విదేశాల్లో షూటింగులు సైతం క్యాన్సిల్ చేసుకుని స్వదేశం చేరుకున్నారు.

 

 

అయితే అందరూ అన్ని షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకుంటే ఒక్క సినిమా మాత్రం షూటింగ్ జరుపుకోవడం విచిత్రం. మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ హీరోగా బ్లేస్సీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆడు జీవితం అనే చిత్రం షూటింగ్ మాత్రం జోర్డాన్ లో జరుగుతోంది. జోర్డాన్ లోనూ పరిస్థితులు బాలేవని షూటింగ్ ఆపమని చెప్పినప్పటికీ రికమెండేషన్ల వల్ల ఈ షూటింగ్ కొనసాగుతుందట.

 

 

అయితే అంత రిస్క్ తీసుకుని షూటింగ్ చేయడం అవసరమా అంటే యూనిట్ లో మొత్తం యాభై మందికి పైగా ఉన్నారట. వారందరినీ మళ్ళీ జోర్డాన్ తీసుకురావాలంటే నిర్మాత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అందుకే నిర్మాత క్షేమం కోసమే హీరో ఈ రిస్క్ చేస్తున్నాడట. కానీ నిర్మాత ఒక్కడే క్షేమంగా ఉంటే సరిపోదు కదా అని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: