తెలుగు హీరోయిన్ల‌కి దొరికే అవ‌కాశాలు చాలా త‌క్కువ. ఒక‌వేళ దొరికినా కొన్నిసార్లు వాళ్ళ ఫేట్ క‌లిసిరాదు. ఇక అలాంటి కోవ‌కు చెందిందే ఇషారెబ్బ‌. అందం అభిన‌యం అన్నీ ఉన్న ఈ భామని ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం చేశాడు. ఈ తెలుగు అమ్మాయి గ‌త కొంత కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ భామ రాగ‌ల‌24గంల్లో, అ, బాండ్‌బాబు ఇలా చాలి సినిమాల్లో న‌టించింది. అంతేకాక అర‌వింద‌స‌మేత‌లో ఎన్టీఆర్ ప‌క్క‌న సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. అయినా కూడా ఈమె ద‌శ ఎందుకో మార‌లేదు. ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోతుంది.  దాని కోసం ఏం చేయ‌డానికైనా.. ఎక్క‌డిదాకా వెళ్ల‌డానికైనా సిద్ధం అనే సంకేతాలిస్తోంది. అయినా పాపం ఆమెని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించే ఛాన్సులు వ‌చ్చినా అవి ప్రాధాన్యం లేని పాత్ర‌లే కావ‌డంతో క్రేజీ హీరోయిన్‌ల జాబితాలో చేర‌లేక‌పోయింది.

 

ఇక ఇదిలా వుంటే... ఇక లాభం లేద‌నుకుందో ఏమోగానీ ఏకంగా ల‌స్ట్ స్టోరీస్‌లో న‌టించ‌డానికి  రెడీ అంటోంది ఈ తెలుగింటి అమ్మాయి. బాలీవుడ్‌లో కియారా అద్వానీ ఏం చేసినా పట్టించుకోని బాలీవుడ్ మేక‌ర్స్ `ల‌స్ట్ స్టోరీస్‌`లో ఆమె న‌ట‌న చూసి వ‌రుస క్రేజీ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఈ వెబ్ సిరీస్ త‌రువాత కియారా తెలుగులో వ‌రుస ఆవ‌కాశాల్ని ద‌క్కించుకుంది. రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న‌, మ‌హేష్ ప‌క్క‌న న‌టించి మెప్పించింది. ఇప్పుడు అదే ల‌స్ట్ స్టోరీస్‌ని తెలుగులో నెట్ ఫ్లిక్స్ రీమేక్ చేస్తోంది. వీటిని సంక‌ల్ప్‌రెడ్డి, నందినిరెడ్డి, త‌రుణ్‌భాస్క‌ర్ వీళ్ళు నాలుగు భాగాల‌ని డైరెక్ట్ చేస్తున్నారు.

 

అయితే కియారా న‌టించిన సిరీస్‌ని తెలుగులో సంక‌ల్ప్‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో కియారా పాత్ర‌లో ఇషా రెబ్బ న‌టిస్తోంది. అయితే హిందీకి మించి హాట్‌గా ఈ సిరీస్ వుంటుంద‌ట‌. ఈ సీరీస్‌కు సంబంధించిన సీన్‌ల‌లో ఇషా టూ హాట్‌గా న‌టించింద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. దీంతో అయినా ఆమెకు తెలుగులో అవ‌కాశాలు పెరుగుతాయో లేదో వేచి చూడాలి. ఇక ఇదిలా ఉంటే అంత హాట్‌గా చేయ‌డానికి ఏముంట‌ద‌బ్బా కియారానే చాలా హాట్‌గా చేసింది ఇంకేమి హాట్ అంటూ కొంత మంది సోష‌ల్ మీడియాలో చిలిపి కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: