తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.  మొదటి సినిమా పిల్లా నువ్వులేని జీవితం తో మంచి విజయం అందుకున్న సాయిధరమ్ తేజ్ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ మూవీస్ తో సూపర్ హిట్స్ అందుకున్నారు. కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నసాయిధరమ్ తేజ్ గత ఏడాది చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలో మంచి విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం సోలో బతుకూ సో బెటరు అనే మూవీలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేస్తుంది కరోనావైరస్.  

 

 

చైనాలో పుట్టుకోచ్చిన ఈ భంకరమైన వైరస్ ఇఫ్పుడు అన్నిదేశాల్లో ప్రళయ తాండవం చేస్తుంది.  ఈ కరోనా భారిన పడి లక్షల మంది విల విలలాడిపోతున్నారు.  వేల మంది మరణాలు సంబవించాయి.  కరోనా అంటే ఇప్పుడు అగ్ర రాజ్యాలు సైతం భయంతో వణికిపోతున్నాయి. ఈ కరోనాని అరికట్టాలంటే బయట మనుషులు తిరగకుండా ఇంటి పట్టున ఉండాలని అంటున్నారు. దాంతో ఈ వైరస్ ఎక్కడా విస్తరించకుండా ఉంటుందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కి పలువురు రాజకీయ, క్రీడా, సినీ రంగానికి చెందిన వారు విరాళాలు ప్రకటిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే పోరాటంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావం తెలుగు చిత్ర పరిశ్రమపైనా పడిన విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో సినీ కార్మికులకు అండగా నిలుస్తూ హీరోలు, దర్శకులు, నిర్మాతలు విరాళాలు ప్రకటిస్తున్నారు.  చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.  ఆయన బాటలోనే పలువురు హీరోలు నడుస్తున్నారు. తాజాగా రోజువారి సినీ కార్మికుల కోసం పది లక్షల రూపాయల విరాళాన్ని సాయి తేజ్ ప్రకటించాడు. ప్రముఖ హీరో చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఛారిటీకి తన విరాళాన్ని ఇవ్వనున్నట్టు తేజ్ తెలిపాడు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: