స్టార్‌డం సంపాదించుకున్న హీరోల‌కు కేవ‌లం సినిమానే జీవితం కాదు. వాళ్ళకీ సొంత బిజినెస్‌లు ఉంటాయి. సొంత వ్యవ‌హారాలు ఉంటాయి. అలాగే బాలీవుడ్ ప‌టౌడి హీరో సైఫ్ అలీ ఖాన్‌కు చాలా ర‌కాల బిజినెస్‌లు ఉన్నాయి. అందులో ఒకటే 'ఫ‌ర్నిచ‌ర్ అండ్ హోమ్‌ ఎల‌క్ట్రానిక్స్'. అయితే గ‌త బుధ‌వారం రోజు 'సైఫ్ అలీ ఖాన్' ఆఫీస్‌లో తొమ్మిది ఎయిర్ కండిష‌నర్స్ దొంగ‌త‌నం చేయ‌బ‌డ్డాయి. అలా దొంగ‌తం చేసిన వారు వాటిని కేవ‌లం 35,000 రూపాల‌య‌లకే అమ్మారు. స్టోరేజ్ రూంలో తొమ్మిది ఎయిర్ కండిష‌ర్స్ పోయిన‌ట్టు 'సైఫ్ అలీ ఖాన్' పి.ఎ 'న‌జియ అలీ ఖాన్' క‌నుక్కున్నాడు. వెంట‌నే ద‌గ్గర్లోని పోలీస్‌స్టేష‌న్‌లో పిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి, లీవ్‌లో ఉన్న ఇద్దరు ఆఫీస్ బాయ్స్‌ను పిలిచి ఇంట‌రాగేష‌న్ చేశారు. ఇంకేముంది ఆ ఇద్దరు ఆఫీస్ బాయ్స్ నిజాల్ని ఒప్పేసుకున్నారు. ఇద్దరు ఆఫీస్ బాయ్స్‌లో ఒక‌రైన సుభాస్‌, త‌న సిస్టర్‌కు ఆరోగ్యం బాగోలేక ఆప‌రేష‌న్ ఖ‌ర్చుల కోసం ఆ పని చేశామ‌ని, త‌ను అడ్వాన్స్ మ‌నీ అడిగినా సార్ ఇవ్వనందుకే ఇది చేయాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించాడు. అయినా వీరు చేసింది త‌ప్పు క‌నుక‌, పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి, ఎఫ్‌.ఐ.ఆర్ పైల్ చేసి జైల్లో పెట్టారు. అయితే దీనిపై సైఫ్ అలీ కాన్ ఏవిధంగా రెస్పాండ్ అవుతాడో చూడాలి మ‌రి. ఆ ఇద్దరు ఆఫీస్ బాయ్స్ అదే ఆఫీస్‌లో గ‌త రెండు సంవ‌త్సరాలుగా ప‌నిచేస్తున్నారంట‌. ఎయిర్ కండిష‌న‌ర్స్‌ను హెడ్ ఆఫీస్ నుండి మ‌రో ఆఫిస్‌కు షిప్ట్ చేస్తుండ‌గా వీరిద్దరూ ఈ దొంగ‌త‌నానికి పాల్పడ్డారని విచార‌ణ‌లో వెల్లడ‌యిన మ‌రో నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: