టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాలు తీసిన కోన వెంకట్ రచయితగా తన ప్రస్థానం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  సినీ పరిశ్రమలో రచయితగా కోన వెంకట్ కి మంచి పేరు వుంది. ఆయన రాసిన కథలతో ఎన్నో సినిమాలు విజయాలను అందుకున్నాయి.  ఒకప్పుడు కోన వెంకట్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ సినిమా తీశారు.  కానీ గత కొంత కాలంగా వీరి మద్య అభిప్రాయ భేదాలు రావడం తెలిసిందే.   ప్రస్తుతం ఆయన రచయితగానే కాకుండా ఇప్పుడు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.   

 

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  నా అసలు పేరు కోన వెంకట్రావు. ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుండగా, 'తోకలేని పిట్ట' సినిమాను నిర్మించాను. అప్పటికే నాకు పరిచయమున్న వర్మ  వద్దని చెప్పినా నేను వినిపించుకోలేదు.  సినీ రంగంలోకి అడుగు పెడుతున్నావు.. కష్టాలు కన్నీళ్లు ఉంటాయని కొంత మంది సన్నిహితులు అప్పట్లో చెప్పారు.  కానీ సినిమాలు అంటే ఎంతో ఇష్టం.. అదే నాన్ను ఇటు వైపు వచ్చేలా చేసిందన్నారు.  అయితే నా ప్రొఫెషన్ కి ఈ సినిమా  పరిశ్రమకు పూర్తి విర్దుదం.. అయినా నేను ఎంట్రీ ఇచ్చాను..వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదనుకున్నాను. 

 

సినిమా ఫీల్డ్ నాకు కొత్త కావడంతో, నేను క్యాష్ చేసుకోలేకపోయాను. ఫలితంగా నష్టాలు వచ్చాయి. మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ .. కానీ ఆ సినిమా నష్టాలతో ఉన్నవన్నీ అమ్మేసుకుని రోడ్డు మీదకి వచ్చేశాను. ఒక చిన్న షెడ్డు లాంటి ఇంట్లోకి మారవలసి వచ్చింది.  అయితే హిట్... ఫ్లాపులు అనేవి సహజం.. దేనికి భయపడాల్సిన అవసరం లేదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఒక దశలో పిల్లలకి ఫీజు కూడా కట్టడానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నేను ముంబైలో వున్న వర్మ దగ్గరికి వెళ్లిపోయాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: